Travis Head: శామ్ కరాన్ బౌలింగ్‌లో ట్రావిస్ హెడ్ విధ్వంసం
ABN, Publish Date - Sep 12 , 2024 | 10:50 AM
ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్ భీకరమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో అతడు అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్ 2024, ఆ తర్వాత స్కాట్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా సిరీస్.. ఇప్పుడు ఇంగ్లాండ్‌పై కూడా హెడ్ తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.
ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్ తన భీకరమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో దూకుడుతో రెచ్చిపోయి ఆడుతున్నాడు. ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్ 2024, ఆ తర్వాత స్కాట్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా సిరీస్.. ఇప్పుడు ఇంగ్లాండ్‌పై కూడా హెడ్ తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.
సౌతాంప్టన్ వేదికగా బుధవారం ఆసీస్ వర్సెస్ ఇంగ్లండ్‌ల మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ దూకుడుగా ఆడి ఆకట్టుకున్నాడు. ఫోర్లు, సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు. 23 బంతుల్లోనే 59 పరుగులు బాదాడు. ఇందులో ఒకే ఓవర్‌లో ఏకంగా 30 పరుగులు రాబట్టాడు. ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ సామ్ కరాన్ వేసిన ఒక ఓవర్‌లో 4, 4, 6, 6, 6, 4 బాదాడు. దీంతో ఆ ఓవర్‌లో ఆస్ట్రేలియాకు 30 పరుగులు వచ్చాయి. హ్యాట్రిక్ సిక్సర్లు బాదిన ట్రావిస్ హెడ్ అందరినీ మంత్రముగ్దులను చేశాడు. ఈ క్రమంలో హెడ్ కేవలం 19 బంతుల్లోనే అర్ధ శతకాన్ని పూర్తి చేసుకున్నారడు.
మైదానం నలువైపులా ఈ షాట్లు ఆడాడు. డీప్ స్క్వేర్ లెగ్ మీదుగా కొట్టిన ఒక సిక్సర్ అందరినీ ఆకట్టుకుంది. ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోయారు. ఈ ఓవర్‌లో అన్ని షాట్లను అద్భుతంగా ఆడాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా చివరి 5 ఓవర్లలో 71 పరుగులు పిండుకుంది. నిజానికి పవర్‌ప్లే తర్వాత ఇంగ్లండ్ బౌలర్లు రాణించారు. పట్టుసాధించేలా కనిపించారు. కానీ ట్రావిస్ హెడ్ విధ్వంసతో ఆస్ట్రేలియా 19.3 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌట్ అయింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ జట్టు 19.2 ఓవర్లలో 151 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో టీ20 సిరీస్‌లో 1-0 తేడాతో ఆస్ట్రేలియా లీడ్‌లో నిలిచింది.
Updated Date - Sep 12 , 2024 | 11:00 AM