ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rishabh pant: పంత్‌తో ప్యాచప్.. ఊర్వశి ప్రయత్నాలు ఫలించేనా..

ABN, Publish Date - Nov 27 , 2024 | 01:47 PM

రిషభ్ పంత్ , ఊర్వశి రౌతెలపై మరోసారి రూమర్లు గుప్పుమంటున్నాయి. రెండేళ్ల క్రితం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న ఈ జంట కోల్డ్ వార్ పక్కన పెట్టిందా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు..

Rishabh pant

ముంబై: బాలీవుడ్ నటి ఊర్వశి రౌతెలా.. టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్ మధ్య ప్రేమాయణం గురించి ఎంతో కాలంగా వార్తలు వచ్చాయి. అయితే, ఓ సారి ఊర్వశి పబ్లిక్ గా చేసిన కామెంట్స్ వీరిద్దరి మధ్య చిచ్చుపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఈ వ్యవహారం అక్కడితో ముగిసిపోయిందని అంతా అనుకున్నారు. కానీ, ఊర్వశి వ్యవహారం చూస్తుంటే మాత్రం వీరిద్దరి మధ్య మళ్లీ ప్రేమ చిగురిస్తుందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. అందుకు కారణం ఇటీవల రిషభ్ పంత్ ను ఉద్దేశిస్తూ ఈ ముద్దుగుమ్మ పోస్టులు పెట్టడమే.


మళ్లీ కలుస్తారా..

మొన్నామధ్య పెర్త్ టెస్టులో టీమిండియా విక్టరీ నమోదు చేసిన సమయంలోనూ ఊర్వశి విక్టరీ వైబ్స్ అంటూ పోస్ట్ చేసింది. దీంతో ఇది పంత్ గురించే అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేశారు. ఇప్పుడు మరోసారి ఓ ఇంటర్వ్యూలో పంత్ గురించి ఈ నటి ప్రస్తావించింది. పంత్ గురించి ఒక్క మాటలో ఏదైనా షేర్ చేసుకోవాలని ఇంటర్వ్యూవర్ కోరడంతో ‘‘ఆల్ ది బెస్ట్ ఫర్ ఆస్ట్రేలియా టూర్’’ అంటూ జవాబిచ్చింది. పంత్ గురించి ఇంత పాజిటివ్ గా మాట్లడటంతో మళ్లీ వీరిద్దరి మధ్య సానుకూల పవనాలు వీస్తునాయని నెటిజన్లు అంటున్నారు. అయితే పంత్ మాత్రం దీనిపై ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు.


అలా విడిపోయారు..

రెండేళ్ల కిందట ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఊర్వశి మాట్లాడిన మాటలు వీరి మధ్య అగ్గిరాజేశాయి. ఆర్ పి అనే వ్యక్తి నాకోసం గంటలకొద్దీ నేనుండే హోటల్ లాబీలో ఎదురుచూసేవాడంటూ చెప్పింది. దీంతో అప్పటికే వీరి మధ్య ఏదో ఉందనే టాక్ నడవడంతో ఆర్ పి అంటే రిషభ్ పంతేనని అంతా ఫిక్సయ్యారు. దీంతో పంత్ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాడు. అలా వీరి మధ్య గ్యాప్ పెరిగింది. ఇప్పుడు మళ్లీ వీరిద్దరిపై రూమర్లు గుప్పుమంటున్నాయి.

Rishabh Pant: అన్ని కోట్లు పోసి కొని.. పంత్‌ను కెప్టెన్ చేయరా.. లక్నో జట్టు అసలు ప్లాన్ ఇదేనా..


Updated Date - Nov 27 , 2024 | 01:47 PM