Virat Kohli: కోహ్లీ యావరేజ్ పడిపోవడానికి అదే కారణం.. మాజీల ఆగ్రహం
ABN, Publish Date - Dec 06 , 2024 | 02:49 PM
కోహ్లీ తన వైఖరితో కోరి కష్టాలను కొనితెచ్చుకుంటున్నాడని మాజీ క్రికెటర్ విమర్శించాడు. ఇప్పటికైనా కోహ్లీ మొండిపట్టు వీడి సమస్యకు పరిష్కారం ఆలోచించాలన్నాడు...
ఆడిలైడ్ వేదికపై తొలి ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీ చౌకబారుగా ఔట్ కావడంపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ బాంబు పేల్చాడు. పెర్త్ లో సెంచరీ చేసిన తర్వాత విరాట్ కోహ్లీ తన జోరును కొనసాగించలేకపోయాడు. ఆసిస్ తో తొలి టెస్టులో సెంచరీ చేసిన తర్వాత తిరిగి ఫామ్ ను అందుకున్నట్టు కనిపించిన కోహ్లీ శుక్రవారం జరిగిన టెస్టులో అభిమానుల ఆశలపై నీళ్లు చల్లాడు. ఈ ఏడాది మొత్తంలో కోహ్లీ ఖాతాలో ఒక సెంచరీ, మరో హాఫ్ సెంచరీ మాత్రమే ఉండటం గమనార్హం.
మిచెల్ స్టార్క్ వేసిన బంతిని స్టీవెన్ స్మిత్ అందుకున్నట్లే బ్యాటింగ్ గ్రేట్ షార్ట్-ఆఫ్-లెంగ్త్ డెలివరీని నేరుగా స్లిప్స్‌కి పంపాడు. ఏడు పరుగులు చేసిన తర్వాత కోహ్లి ఔటయ్యాడు. మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ.. కోహ్లీ విఫలమవ్వడానికి గల కారణాలను తెలిపాడు. విరాట్ కోహ్లీ సగటు 48కి దిగజారడానికి ప్రధాన కారణం అతడి బలహీనతేనన్నాడు. సమస్యను పరిష్కరించడానిక బదులు మొండిగా వ్యవహరించి పరిస్థితిని మరింత క్లిష్టతరం చేయడమే అతడు చేస్తున్న తప్పిదంగా తెలిపాడు.
‘‘విరాట్ కోహ్లీ బ్యాటింగ్ సగటు దిగజారడానికి ఓ ముఖ్య కారణం ఉంది. అంతకుముందు 50ప్లస్ ఉండే అతడి యావరేజ్ 48కి పడిపోయింది. అవుట్‌సైడ్ ఆఫ్ బలహీనత కాణంగా కోహ్లీ వెనకబడేలా చేస్తోంది. అందులో నుంచి బయటపడేందుకు కోహ్లీ ప్రయత్నించకపోగా తన మొండి ప్వరర్తనతో మరింత దిగజార్చుకుంటున్నాడు’’ అని మంజ్రేకర్ తన పోస్టుద్వారా వెల్లడించాడు.
Shubman Gill: జేబులో కర్చీఫ్‌తో బ్యాటింగ్.. గిల్ ఎందుకిలా చేశాడో తెలుసా..
Updated Date - Dec 06 , 2024 | 02:59 PM