ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MS Dhon IPL: సీఎస్కే రిటెన్షన్ ప్లేయర్ల లిస్ట్ ఇదేనా.. మరి ధోనీని రిటెయిన్ చేసుకునేదెలా

ABN, Publish Date - Oct 27 , 2024 | 05:52 PM

టీమిండియా మాజీ దిగ్గజం, ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ వచ్చే ఐపీఎల్ సీజన్‌లో ఆడబోతున్నాడంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. తిరిగి ఐపీఎల్ ఆడడం దృష్టి పెట్టినట్టుగా కథనాలు వెలువడుతున్నాయి.

టీమిండియా మాజీ దిగ్గజం, ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ వచ్చే ఐపీఎల్ సీజన్‌2025లో ఆడబోతున్నాడంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. తిరిగి ఐపీఎల్ ఆడడంపై అతడు దృష్టి పెట్టినట్టుగా కథనాలు గుప్పుమంటున్నాయి. ఇక ఓ కార్యక్రమంలో ధోనీ మాట్లాడుతూ చివరిగా మిగిలివున్న కొన్నేళ్ల క్రికెట్‌ను ఆస్వాదించాలని కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించాడు. ఇదే విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఫ్రాంచైజీ సీఈవో కాశీ విశ్వనాథన్‌ను సంప్రదించగా.. ధోనీ మరొక ఐపీఎల్ సీజన్‌కు సన్నద్దమవుతున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు.

‘‘ధోనీ సిద్ధంగా అంటే అంతకుమించి మాకేం కావాలి. మేము సంతోషంగా ఉన్నాం’’ అని విశ్వనాథన్ శనివారం క్రిక్‌బజ్‌తో చెప్పారు. రిటెన్షన్ జాబితాను ఖరారు చేయమంటూ ఫ్రాంచైజీ యజమాని ఎన్ శ్రీనివాసన్‌కు ధోనీ చెప్పడమే తరువాయి అని ఆయన అన్నారు. దీంతో ధోనీని సీఎస్కే రిటెయిన్ చేసుకోవడం ఖాయమంటూ వార్తలు వెలువడుతున్నాయి. మరి ధోనీ రిటెన్షన్‌పై వార్తలు వెలువడుతున్న వేళ సీఎస్కే రిటెయిన్ ఆటగాళ్ల జాబితా ఇదేనంటూ ఒక జాబితా చక్కర్లు కొడుతోంది.


సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌ను తొలి ఆటగాడిగా కాకుండా టీ20 ప్రపంచ కప్ విజయం తర్వాత అంతర్జాతీయ టీ20 కెరీర్‌కు గుడ్‌బై పలికిన రవీంద్ర జడేజాగా రిటెన్షన్‌లో తొలి ఛాయిస్‌గా ఎంపిక చేసినట్టు కథనాలు వెలువడుతున్నాయి.2వ ఆటగాడిగా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌ను, 3వ ఆటగాడిగా పేసర్ మతీశ పతిరణ, ఇక శివమ్ దూబే, డెవోన్ కాన్వే, సమీర్ రిజ్వీలలో ఇద్దరు ఆటగాళ్లను ఫ్రాంచైజీ రిటైన్ చేసే అవకాశం ఉంది. దీంతో ఎంఎస్ ధోనీ అన్‌క్యాప్డ్ ప్లేయర్ కేటగిరిలో రిటెయిన్ చేసుకునే అవకాశం ఉందంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. మరి చెన్నై సూపర్ కింగ్స్ వ్యూహం ఎలా ఉంటుందో వేచిచూడాలి.

Updated Date - Oct 27 , 2024 | 05:54 PM