ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sachin Tendulkar: అంపైర్ మోసం వల్లే సచిన్ డబుల్ సెంచరీ చేయగలిగాడు.. దక్షిణాఫ్రికా బౌలర్ సంచలన ఆరోపణలు!

ABN, Publish Date - Aug 26 , 2024 | 09:56 PM

టెస్ట్ క్రికెట్‌లో డబుల్ సెంచరీలు సాధించడం సాధ్యమేమో గానీ, పరిమిత ఓవర్ల ఫార్మాట్ అయిన వన్డల్లో డబుల్ సెంచరీ అనేది ఊహకు కూడా అందని విషయం అలాంటిది. అలాంటిది రికార్డులు రారాజు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 2010లో అద్భుతం చేశాడు. వన్డేల్లో తొలిసారి డబుల్ సెంచరీ సాధించాడు.

Sachin Tendulkar ODI Double Century

టెస్ట్ క్రికెట్‌లో డబుల్ సెంచరీలు (Double Century) సాధించడం సాధ్యమేమో గానీ, పరిమిత ఓవర్ల ఫార్మాట్ అయిన వన్డల్లో డబుల్ సెంచరీ (ODI Double Century) అనేది ఊహకు కూడా అందని విషయం అలాంటిది. అలాంటిది రికార్డులు రారాజు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) 2010లో అద్భుతం చేశాడు. వన్డేల్లో తొలిసారి డబుల్ సెంచరీ సాధించాడు. అరవీర భయంకరులైన దక్షిణాఫ్రికా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ నమ్మశక్యం కాని రీతిలో డబుల్ సెంచరీ చేశాడు. అయితే ఆ డబుల్ సెంచరీ వెనుక మోసం దాగుందని ఆ మ్యాచ్‌లో బౌలింగ్ చేసిన దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్ (Dale Steyn) ఆరోపించాడు.


ఆ మ్యాచ్‌లో అంపైరింగ్ చేసిన ఇయాన్ గోల్డ్ (Umpire Ian Gould) మోసం వల్లే సచిన్ డబుల్ సెంచరీ చేయగలిగాడని అన్నాడు. ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్‌తో పాడ్‌కాస్ట్‌లో డేల్ స్టెయిన్ మాట్లాడుతూ ఈ ఆరోపణలు చేశాడు. ``2010లో గ్వాలియర్‌లో జరిగిన వన్డే మ్యాచ్‌లో సచిన్ మాపై డబుల్ సెంచరీ చేశాడు. అయితే 190 పరుగుల వద్ద ఉన్నప్పుడు అతడిని నేను అవుట్ చేశాను. అయితే అంపైర్ ఇయాన్ గోల్డ్ నాటౌట్‌గా ప్రకటించాడు. నేను షాకయ్యాను. ఎందుకు అవుట్ ఇవ్వలేదని ఆ తర్వాత ఇయాన్‌ను నేను అడిగాను. ``సచిన్‌ను ఔట్‌గా ప్రకటిస్తే నేను హోటల్‌కు వెళ్లలేను`` అని ఇయాన్ బదులిచ్చాడు`` అంటూ స్టెయిన్ చెప్పాడు.


ఏదేమైనా వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ సాధించిన బ్యాట్స్‌మెన్‌గా సచిన్ రికార్డు సాధించాడు. సచిన్ తర్వాత చాలా మంది ఆ ఘనత అందుకున్నారు. సచిన్ తర్వాత 2011లో వీరేంద్ర సెహ్వాగ్ 219 పరుగులు చేశాడు. ఆ తర్వాత టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఏకంగా మూడు సార్లు వన్డేల్లో డబుల్ సెంచరీలు కొట్టాడు. వన్డేల్లో అత్యధిక స్కోరు (264) పరుగుల రికార్డు ఇప్పటికీ రోహిత్ పేరు మీదే ఉంది. కాగా, సచిన్‌తో సహా ఇప్పటివరకు వన్డల్లో డబుల్ సెంచరీలు చేసిన ఆటగాళ్లు 12 మంది మాత్రమే.


ఇవి కూడా చదవండి..

Pakistan: పాకిస్తాన్‌కు మరో ఎదురు దెబ్బ.. డబ్ల్యూటీసీలో ఆరు పాయింట్లు కోత.. బంగ్లాకూ ఫైన్!


బంగ్లా చారిత్రక విజయం


పారా హుషార్‌

వచ్చే జూన్‌ 20 నుంచి ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 26 , 2024 | 09:56 PM

Advertising
Advertising
<