ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

David Warner: డేవిడ్ వార్నర్ 70 శాతం ఇండియన్.. 30 శాతమే ఆస్ట్రేలియన్: జేక్ ఫ్రేజర్

ABN, Publish Date - May 04 , 2024 | 04:50 PM

పేరుకు ఆస్ట్రేలియా క్రికెటర్ అయినప్పటికీ ఐపీఎల్ కారణంగా డేవిడ్ వార్నర్ భారతీయులకు చాలా సుపరిచితుడు అయిపోయాడు. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ తరఫున ఆడినపుడు సోషల్ మీడియాలో వార్నర్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు.

David Warner

పేరుకు ఆస్ట్రేలియా క్రికెటర్ అయినప్పటికీ ఐపీఎల్ (IPL 2024) కారణంగా డేవిడ్ వార్నర్ (David Warner) భారతీయులకు చాలా సుపరిచితుడు అయిపోయాడు. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) టీమ్ తరఫున ఆడినపుడు సోషల్ మీడియాలో వార్నర్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. బాలీవుడ్ సినిమాలతో పాటు తెలుగు సినిమాల హీరోలను కూడా చక్కగా అనుకరించేవాడు. పాపులర్ తెలుగు సినిమా పాటలకు డ్యాన్సులు వేసేవాడు. ప్రస్తుతం వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్ (DC) టీమ్ తరఫున ఆడుతున్నాడు.


డేవిడ్ వార్నర్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ సహచర యువ ఆటగాడు జేక్ ఫ్రేజర్ మెక్ గుర్క్ (Fraser-McGurk) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వార్నర్ చాలా నిస్వార్థమైన వ్యక్తని కితాబిచ్చాడు. ``నేను ఇప్పటివరకు కలిసిన వాళ్లలో వార్నర్ అత్యంత సరదాగా ఉండే క్రికెటర్. స్వార్థం అనేది ఉండదు. ఏ అవసరం వచ్చినా సహాయం చేసేందుకు సిద్ధంగా ఉంటాడు. అతడిని చూస్తుంటే నాకు భారతీయ పౌరుడిలాగానే అనిపిస్తాడు. అతడు 70 శాతం ఇండియన్, 30 శాతం అస్ట్రేలియన్‌లా అనిపిస్తాడు. మేమిద్దరం క్యాప్‌ల కోసం గోల్ఫ్ ఆడేవాళ్లం`` అని జేక్ ఫ్రేజర్ తెలిపాడు.


``డేవిడ్ వార్నర్ గురించి నాకేమీ తెలియదు. నా స్టోరీ మొత్తం అతడికి తెలుసు. అతడు గోల్ఫ్ కూడా అద్భుతంగా ఆడతాడు. ప్రస్తుత ఐపీఎల్‌ను ఆస్వాదిస్తున్నా. క్రికెటర్ల మీద ఉండే అంచనాల గురించి నాకు తెలుసు. అయితే అనవసరంగా వాటిని మోసే పని నేను పెట్టుకోను. ఆటను ఆస్వాదిస్తూ ఆడతాన``ని మరో యువ ఆటగాడు ట్రిస్టన్ స్టబ్స్ వ్యాఖ్యానించాడు.

ఇవి కూడా చదవండి..

T20 Worldcup: ఇదే ఉత్తమ జట్టు.. అందుకే రింకూ సింగ్‌కు చోటు దక్కలేదేమో: సౌరవ్ గంగూలీ


T20 World Cup: హార్దిక్ పాండ్యాకు షాక్.. అతడి స్థానంలో ఆ క్రికెటర్‌ను..


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 04 , 2024 | 04:50 PM

Advertising
Advertising