ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

దిగజారిన కోహ్లీ, రోహిత్‌ ర్యాంకులు

ABN, Publish Date - Dec 12 , 2024 | 06:23 AM

ఆస్ట్రేలియాతో అడిలైడ్‌ టెస్ట్‌లో ఘోరంగా విఫలమైన స్టార్‌ బ్యాటర్లు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మల ఐసీసీ ర్యాంకులు దారుణంగా దిగజారాయి. బుధవారం విడుదలైన టెస్ట్‌ బ్యాటర్ల రాంకింగ్స్‌లో విరాట్‌

దుబాయ్‌: ఆస్ట్రేలియాతో అడిలైడ్‌ టెస్ట్‌లో ఘోరంగా విఫలమైన స్టార్‌ బ్యాటర్లు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మల ఐసీసీ ర్యాంకులు దారుణంగా దిగజారాయి. బుధవారం విడుదలైన టెస్ట్‌ బ్యాటర్ల రాంకింగ్స్‌లో విరాట్‌ 14వ స్థానం నుంచి 20కి పడిపోయాడు. బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ రెండో టెస్ట్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లో విరాట్‌ వరుసగా 7,11 పరుగులే చేశాడు. ఇక..ఇదే గులాబీ టెస్ట్‌లో ఆరో నెంబర్‌లో బరిలో దిగిన కెప్టెన్‌ రోహిత్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి తొమ్మిది పరుగులే సాధించాడు. ఫలితంగా ఐదు ర్యాంకులు కోల్పోయిన రోహిత్‌ 31వ స్థానంలో నిలవడం గమనార్హం. గత ఆరేళ్లలో రోహిత్‌ 30వ స్థానంకంటే కిందికి పడిపోవడం ఇదే తొలిసారి. యువ ఆటగాడు యశస్వీ జైస్వాల్‌ తన అత్యుత్తమ ర్యాంకును కొనసాగిస్తూ నాలుగో స్థానంలో నిలిచాడు. బౌలర్ల విభాగంలో బుమ్రా తన టాప్‌ ర్యాంక్‌ను కొనసాగించాడు.

Updated Date - Dec 12 , 2024 | 06:23 AM