ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఢిల్లీ.. భళా

ABN, Publish Date - Apr 13 , 2024 | 02:21 AM

పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆల్‌రౌండ్‌ షోతో ఆకట్టుకుంది. బౌలింగ్‌లో స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ (3/20) కీలక వికెట్లతో లఖ్‌నవూ వెన్ను విరవగా, బ్యాటింగ్‌లో 21 ఏళ్ల ఫ్రేసర్‌ మెక్‌గర్గ్‌ (35 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 55) ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌లోనే...

నేటి మ్యాచ్‌

పంజాబ్‌ X రాజస్థాన్‌, వేదిక: ముల్లాపూర్‌, రా.7.30 గం.

ఆకట్టుకున్న ఫ్రేసర్‌

  • లఖ్‌నవూ పరాజయం

  • దెబ్బతీసిన స్పిన్నర్‌ కుల్దీప్‌

  • బదోని పోరాటం వృధా

లఖ్‌నవూ: పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆల్‌రౌండ్‌ షోతో ఆకట్టుకుంది. బౌలింగ్‌లో స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ (3/20) కీలక వికెట్లతో లఖ్‌నవూ వెన్ను విరవగా, బ్యాటింగ్‌లో 21 ఏళ్ల ఫ్రేసర్‌ మెక్‌గర్గ్‌ (35 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 55) ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌లోనే సత్తా చాటుకున్నాడు. దీంతో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో నెగ్గింది. అలాగే నాలుగు పాయింట్లతో ఓ స్థానం ఎగబాకగా.. ఆర్‌సీబీ కిందికి దిగజారింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూ 20 ఓవర్లలో 7 వికెట్లకు 167 పరుగులు చేసింది. ఆయుష్‌ బదోని (35 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 55 నాటౌట్‌), రాహుల్‌ (39) రాణించారు. ఖలీల్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో ఢిల్లీ 18.1 ఓవర్లలో 4 వికెట్లకు 170 పరుగులు చేసి గెలిచింది. పంత్‌ (24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 41), పృథ్వీ షా (22 బంతుల్లో 6 ఫోర్లతో 32) రాణించారు. బిష్ణోయ్‌కు రెండు వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా కుల్దీప్‌ నిలిచాడు.

ఫ్రేసర్‌ దూకుడు: వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలి, ఎన్‌గిడి గాయంతో ఢిల్లీ జట్టులో చేరిన యువ బ్యాటర్‌ ఫ్రేసర్‌ మెక్‌గర్గ్‌ అదరగొట్టాడు. ఎలాంటి బెదురు లేకుండా ఎడాపెడా షాట్లతో చకచకా స్కోరుబోర్డును కదిలించాడు. ఓపెనర్‌ వార్నర్‌ (8) నాలుగో ఓవర్‌లోనే వెనుదిరిగినా.. మరో ఓపెనర్‌ పృథ్వీ షాతో కలిసి మెక్‌గర్గ్‌ లఖ్‌నవూపై ఎదురుదాడికి దిగాడు. సిక్సర్‌తో తన పరుగుల ఖాతా తెరిచిన తను ఐదో ఓవర్‌లో మరో 6,4 బాదాడు. అటు షా కూడా వరుస ఫోర్లు కొట్టగా పవర్‌ప్లేలో జట్టు 62/1తో నిలిచింది. ఆ తర్వాత నాలుగు ఓవర్లలో ఢిల్లీ కేవలం 13 పరుగులే చేసి షా వికెట్‌ కోల్పోయింది. ఈ దశలో పంత్‌, ఫ్రేసర్‌ గేరు మార్చడంతో ధారాళంగా పరుగులు వచ్చాయి. పంత్‌ 11వ ఓవర్‌లో 6,4.. 12వ ఓవర్‌లో 4,4 బాదడంతో 25 పరుగులు వచ్చాయి. ఇక ఫ్రేసర్‌ మరింతగా చెలరేగి 13వ ఓవర్‌లో బాదిన హ్యాట్రిక్‌ సిక్సర్లతో ఏకంగా 21 రన్స్‌ సమకూరాయి. ఈ క్రమంలో అతడు 31 బంతుల్లోనే తన కెరీర్‌లో తొలి ఫిఫ్టీని పూర్తి చేసుకున్నాడు. మరోవైపు వరుస ఓవర్లలో ఈ ఇద్దరూ పెవిలియన్‌కు చేరినా అప్పటికే లక్ష్యం వేగంగా తగ్గిపోయింది. చివర్లో స్టబ్స్‌ (15 నాటౌట్‌), హోప్‌ (11 నాటౌట్‌) మరో 11 బంతులుండగానే లాంఛనాన్ని ముగించారు.

ఆదుకున్న బదోని: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూ బ్యాటర్ల తీరు చూశాక, పూర్తి ఓవర్లు ఆడుతుందని ఎవరూ భావించలేదు. కానీ ఆఖర్లో ఆయుష్‌ బదోని ఎదురుదాడికి అర్షద్‌ ఖాన్‌ (20 నాటౌట్‌) సహకారం తోడు కావడంతో జట్టు గౌరవప్రదమైన స్కోరును అందుకోగలిగింది. వాస్తవానికి పవర్‌ప్లేలోనే రెండు వికెట్లు కోల్పోయినా 57 పరుగులతో పటిష్టంగానే కనిపించింది. కానీ ఆ తర్వాతే వరుస విరామాల్లో వికెట్లు చేజార్చుకొని ఇబ్బందుల్లో పడింది. పేసర్లు ఖలీల్‌, ఇషాంత్‌, స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ మ్యాజిక్‌ బంతులకు ఎల్‌ఎ్‌సజీ మిడిలార్డర్‌ వణికిపోయింది. ఊపు మీదున్న ఓపెనర్‌ డికాక్‌ (19), దేవ్‌దత్‌ (3)లను పేసర్‌ ఖలీల్‌ తన వరుస ఓవర్లలో వెనక్కి పంపాడు. అయితే ఆరో ఓవర్‌లో రాహుల్‌ రెండు ఫోర్లతో ఆకట్టుకున్నాడు. ఇక కుల్దీప్‌ బంతి చేత పట్టాక సీన్‌ మారిపోయింది. ఎనిమిదో ఓవర్‌లో అతను హిట్టర్లు స్టొయినిస్‌ (8), పూరన్‌ (0)లను వరుస బంతుల్లో వెనక్కి పంపడంతో ఎల్‌ఎ్‌సజీ షాక్‌కు గురైంది. ఆ వెంటనే చక్కగా కుదురుకున్న రాహుల్‌ను తన తర్వాతి ఓవర్‌లోనే అవుట్‌ చేశాడు. ఢిల్లీ రివ్యూకు వెళ్లి ఈ వికెట్‌ సాధించింది. ఇక పేసర్లు ఇషాంత్‌, ముకేశ్‌ విజృంభణకు దీపక్‌ హుడా (10), క్రునాల్‌ పాండ్యా (3) సైతం పెవిలియన్‌ చేరడంతో జట్టు 94/7 స్కోరుతో కష్టాల్లో పడింది. అప్పటి మరో ఏడు ఓవర్లు మిగిలి ఉండడంతో జట్టు అంతలోపే ఆలౌట్‌ ఖాయమనిపించింది. ఈ దశలో బదోని-అర్షద్‌ ఖాన్‌ అద్భుత ఆటతీరుతో ఎనిమిదో వికెట్‌కు అజేయంగా 73 పరుగులు జోడించడం విశేషం. 15వ ఓవర్‌లో బదోని రెండు ఫోర్లతో 14 రన్స్‌ రాబట్టి స్కోరులో కదలిక తెచ్చాడు. 18వ ఓవర్‌లో అతడి సిక్సర్‌, అర్షద్‌ ఖాన్‌ ఫోర్‌తో మరో 15 రన్స్‌ వచ్చాయి. ఇక బదోని మరో రెండు ఫోర్లతో 31 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేశాడు. ఆఖరి ఓవర్‌లో లఖ్‌నవూ 11 రన్స్‌ సాధించడంతో 160 దాటింది.

స్కోరుబోర్డు

లఖ్‌నవూ: డికాక్‌ (ఎల్బీ) ఖలీల్‌ 19, రాహుల్‌ (సి) పంత్‌ (బి) కుల్దీప్‌ 39, పడిక్కళ్‌ (ఎల్బీ) ఖలీల్‌ 3, స్టొయినిస్‌ (సి) ఇషాంత్‌ (బి) కుల్దీప్‌ 8, పూరన్‌ (బి) కుల్దీప్‌ 0, దీపక్‌ హుడా (సి) వార్నర్‌ (బి) ఇషాంత్‌ 10, బదోని (నాటౌట్‌) 55, క్రునాల్‌ (సి) పంత్‌ (బి) ముకేశ్‌ 3, అర్షద్‌ (నాటౌట్‌) 20, ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 20 ఓవర్లలో 167/7; వికెట్ల పతనం: 1-28, 2-41, 3-66, 4-66, 5-77, 6-89, 7-94; బౌలింగ్‌: ఖలీల్‌ అహ్మద్‌ 4-0-41-2, ఇషాంత్‌ 4-0-36-1, ముకేశ్‌ 4-0-41-1, అక్షర్‌ 4-0-26-0, కుల్దీప్‌ యాదవ్‌ 4-0-20-3.

ఢిల్లీ: పృథ్వీ షా (సి) పూరన్‌ (బి) బిష్ణోయ్‌ 32, వార్నర్‌ (బి) యశ్‌ 8, జేక్‌ ఫ్రేసర్‌ (సి) అర్షద్‌ (బి) నవీనుల్‌ 55, పంత్‌ (స్టంప్డ్‌) రాహుల్‌ (బి) బిష్ణోయ్‌ 41, స్టబ్స్‌ (నాటౌట్‌) 15, హోప్‌ (నాటౌట్‌) 11, ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 18.1 ఓవర్లలో 170/4; వికెట్ల పతనం: 1-24, 2-63, 3-140, 4-146; బౌలింగ్‌: అర్షద్‌ ఖాన్‌ 3.1-0-34-0, నవీనుల్‌ హక్‌ 3-0-24-1, యశ్‌ ఠాకూర్‌ 4-0-31-1, క్రునాల్‌ 3-0-45-0, రవి బిష్ణోయ్‌ 4-0-25-2, స్టొయినిస్‌ 1-0-10-0.

పాయింట్ల పట్టిక

జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే

రాజస్థాన్‌ 5 4 1 0 8 0.871

కోల్‌కతా 4 3 1 0 6 1.528

చెన్నై 5 3 2 0 6 0.666

లఖ్‌నవూ 5 3 2 0 6 0.436

హైదరాబాద్‌ 5 3 2 0 6 0.344

గుజరాత్‌ 6 3 3 0 6 -0.637

ముంబై 5 2 3 0 4 -0.073

పంజాబ్‌ 5 2 3 0 4 -0.196

ఢిల్లీ 6 2 4 0 4 -0.975

బెంగళూరు 6 1 5 0 2 -1.124

గమనిక: ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి;

ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు; నె.రరే: నెట్‌ రన్‌రేట్‌

1

ఐపీఎల్‌లో వంద పరుగుల్లోపే ఏడు వికెట్లు కోల్పోయినా, ఓ జట్టు అత్యధిక స్కోరు (167/7) సాధించడం ఇదే తొలిసారి. గతంలో సన్‌రైజర్స్‌ (154/9) పేరిట ఈ రికార్డు ఉండేది.

Updated Date - Apr 13 , 2024 | 02:21 AM

Advertising
Advertising