ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఊహించని షాక్.. ఆ స్టార్ ప్లేయర్ యూ-టర్న్?

ABN, Publish Date - Apr 14 , 2024 | 03:31 PM

ఈ ఐపీఎల్ సీజన్‌లో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి తాజాగా ఓ ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ ఒకరు దూరం అవ్వాల్సి వచ్చింది. ఇంతకీ.. ఆ ఆటగాడు ఎవరని అనుకుంటున్నారా?

ఈ ఐపీఎల్ (IPL) సీజన్‌లో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్టుకి తాజాగా ఓ ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ ఒకరు దూరం అవ్వాల్సి వచ్చింది. ఇంతకీ.. ఆ ఆటగాడు ఎవరని అనుకుంటున్నారా? మరెవ్వరో కాదు.. మిచెల్ మార్ష్ (Mitchell Marsh). ప్రస్తుతం అతను తొడ కండరాల గాయంతో (Hamstring Niggle) బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే.. తన గాయానికి శస్త్రచికిత్స చేయించుకోవడం కోసం మార్ష్ తిరిగి తన స్వదేశానికి వెళ్లాడు. ఢిల్లీ టీమ్ మేనేజ్‌మెంట్‌తో సంప్రదింపుల తర్వాతే అతడు ఆస్ట్రేలియాకు (Australia) వెళ్లినట్లు తెలిసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్ష్ లాంటి ఆటగాడు దూరమవ్వడం అనేది.. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి పెద్ద దెబ్బ తగిలినట్లే!

Punjab Kings: సామ్ కరన్ vs జితేశ్ శర్మ.. వైస్ కెప్టెన్ వివాదం పంజాబ్ కింగ్స్ క్లారిటీ


కాగా.. ఈ ఏడాది జూన్ నుంచే టీ20 వరల్డ్‌కప్ ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా జట్టులో మిచెల్ స్టార్క్ అత్యంత కీలక ఆటగాడు. ఇలాంటి తరుణంలో అతని గాయం అవ్వడంతో.. ఆస్ట్రేలియా జట్టు ఆందోళన చెందుతోంది. ఆలోపు తాను ఫిట్‌గా సిద్ధం అవ్వాలన్న ఉద్దేశంతో.. ఐపీఎల్ మధ్యలోనే ఇలా స్వదేశానికి వెళ్లి, అక్కడ చికిత్స చేయించుకోవాలని డిసైడ్ అయినట్లు తెలిసింది. నిజానికి.. తనకైన ఈ గాయం కారణంగానే అతను గత రెండు ఢిల్లీ మ్యాచ్‌లకు దూరం అయ్యాడు. ఈ గాయం త్వరగానే తగ్గుతుందని మొదట్లో అనుకున్నారు కానీ.. అది మరింత తీవ్రమవుతున్న తరుణంలో, స్వేదేశానికి వెళ్లాడు. ఇక ఈ ఏడాది ఐపీఎల్‌లో మార్ష్ ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో తన ఇంపాక్ట్ చూపించలేకపోయాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 14 , 2024 | 03:31 PM

Advertising
Advertising