ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Paris Olympics 2024: లక్ష్య సేన్ విజయం డిలీట్.. ఒలింపిక్స్‌లో భారత ఆటగాడికి వింత పరిస్థితి!

ABN, Publish Date - Jul 29 , 2024 | 11:49 AM

భారత షట్లర్ లక్ష్య సేన్‌కు పారిస్ ఒలింపిక్స్ 2024లో విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. ప్రత్యర్థిపై సునాయాసంగా గెలిచిన లక్ష్య సేన్, ఆ విజయాన్ని మాత్రం తన ఖాతాలో వేసుకోలేకపోయాడు. పారిస్ ఒలింపిక్స్ పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ గ్రూప్ దశలో రెండు సెట్లలోనే లక్ష్య సేన్ విజయం సాధించాడు. అయితే..

Lakshya Sen's victory deleted

భారత షట్లర్ లక్ష్య సేన్‌ (Lakshya Sen)కు పారిస్ ఒలింపిక్స్ 2024 (Paris Olympics 2024)లో విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. ప్రత్యర్థిపై సునాయాసంగా గెలిచిన లక్ష్య సేన్, ఆ విజయాన్ని మాత్రం తన ఖాతాలో వేసుకోలేకపోయాడు. పారిస్ ఒలింపిక్స్ పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ గ్రూప్ దశలో రెండు సెట్లలోనే లక్ష్య సేన్ విజయం సాధించాడు. అయితే మ్యాచ్ అనంతరం ఆ ఫలితం డిలీట్ అయింది (Victory Deleted). ప్రత్యర్థి ఆటగాడు గాయపడడంతో లక్ష్య సేన్‌కు నిరాశ ఎదురైంది.


గత శనివారం లక్ష్య సేన్ తన తొలి మ్యాచ్‌లో గ్వాటెమాలా ఆటగాడు కెవిన్ కార్డన్‌తో తలపడ్డాడు. వరుస సెట్లలో 21-8, 22-20తో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి విజయం సాధించాడు. అయితే ఈ మ్యాచ్ అనంతరం ఎడమ చేయి గాయం కారణంగా కెవిన్ పారిస్ ఒలింపిక్స్ 2024 నుంచి వైదొలిగాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ జనరల్ కాంపిటీషన్ నిబంధనల ప్రకారం.. గ్రూప్ దశలో ఎవరైనా ఆటగాడు గాయం కారణంగా వైదొలిగితే అప్పటివరకు అతడు ఆడిన మ్యాచ్‌లు, ఆ తర్వాత ఆడాల్సిన మ్యాచ్‌లను రద్దు చేసేస్తారు. వాటి ఫలితాలను రికార్డుల నుంచి తొలగిస్తారు.


కెవిన్ వైదొలగడంతో బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ గ్రూప్ ఎల్‌ లో ముగ్గురు ఆటగాళ్లే మిగిలారు. లక్ష్య సోమవారం తన తర్వాతి మ్యాచ్‌లో బెల్జియం ఆటగాడు జులియన్ కరాగీతో తలపడతాడు. బుధవారం జరిగే మ్యాచ్‌లో ఇండోనేసియా ఆటగాడు జోనాథన్ క్రిస్టీతో ఆడతాడు. ఈ గ్రూప్‌లో టాప్ స్థానంలో నిలిచిన ఆటగాడు తర్వాతి దశకు చేరుకుంటాడు.

ఇవి కూడా చదవండి..

Suryakumar Yadav: సూర్య కుమార్ యాదవ్ ఏమన్నారంటే..!!


మను చరిత్ర


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 29 , 2024 | 11:49 AM

Advertising
Advertising
<