ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గాయత్రి జోడీకి నిరాశ

ABN, Publish Date - Dec 12 , 2024 | 06:22 AM

ఉత్కంఠగా జరిగిన తొలి టీ20లో జింబాబ్వే 4 వికెట్లతో అఫ్ఘానిస్థాన్‌ను ఓడించింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్ఘాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 144 పరుగులు సాధించింది.

హాంగ్జౌ (చైనా): ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (డబ్ల్యూబీఎఫ్‌) వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ తొలి మ్యాచ్‌లో గాయత్రి/ట్రీసా జాలీ ద్వయం పోరాడి ఓడింది. బుధవారం ప్రారంభమైన ఈ టోర్నీ గ్రూప్‌ ‘ఎ’లో తలపడుతున్న గాయత్రి జోడీ మొదటి మ్యాచ్‌లో ప్రపంచ నెంబర్‌ వన్‌ జంట లియు షెంగ్‌ షు/టాన్‌ నింగ్‌కు గట్టి పోటీనిచ్చింది. చివరకు 20-22, 22-20, 14-21తో పరాజయం చవిచూసింది. గురువారం జరిగే గ్రూపు రెండో మ్యాచ్‌లో పెర్లీ టాన్‌/తినా మురళీథరన్‌ (మలేసియా) జోడీని గాయత్రి/ట్రీసా జంట ఢీకొంటుంది.

జింబాబ్వే ఉత్కంఠ విజయం

హరారే: ఉత్కంఠగా జరిగిన తొలి టీ20లో జింబాబ్వే 4 వికెట్లతో అఫ్ఘానిస్థాన్‌ను ఓడించింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్ఘాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 144 పరుగులు సాధించింది. జనత్‌ (54), నబి (44) రాణించారు. ఛేదనలో జింబాబ్వే 145/6 స్కోరు చేసి గెలిచింది. బ్రియాన్‌ (49), మేయర్స్‌ (32) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.

Updated Date - Dec 12 , 2024 | 06:22 AM