ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అథ్లెటిక్స్‌లో పోరాటం ముగిసె..

ABN, Publish Date - Aug 10 , 2024 | 06:35 AM

ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ విభాగంలో భారత అథ్లెట్ల పోరాటం ముగిసింది. శుక్రవారం పురుషుల 4గీ400మీ. రిలే టీమ్‌ కొద్దిలో ఫైనల్‌

ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ విభాగంలో భారత అథ్లెట్ల పోరాటం ముగిసింది. శుక్రవారం పురుషుల 4X400మీ. రిలే టీమ్‌ కొద్దిలో ఫైనల్‌ అవకాశాన్ని కోల్పోయింది. ఆసియా గేమ్స్‌లో స్వర్ణం సాధించిన వీరిపై ఒలింపిక్స్‌లోనూ అంచనాలు నెలకొన్నాయి. అయితే ముహమ్మద్‌ అనాస్‌, ముహమ్మద్‌ అజ్మల్‌, అమోజ్‌ జాకబ్‌, రాజేశ్‌ రమేశ్‌లతో కూడిన ఈ బృందం శుక్రవారం జరిగిన హీట్స్‌ 2 క్వాలిఫికేషన్‌లో 3:00.58 సెకన్ల టైమింగ్‌తో సీజన్‌ బెస్ట్‌ సాధించింది. అయితే రెండో స్థానంలో నిలిచిన నైజీరియా నిబంధనల ఉల్లంఘనతో డిస్‌క్వాలిఫై కావడంతో భారత్‌ ఐదు నుంచి నాలుగో స్థానానికి చేరింది. అలాగే భారత్‌కన్నా కేవలం 0.32 సెకన్ల వేగంతో రేసును ముగించి మూడో స్థానంలో నిలిచిన ఇటలీ ఫైనల్‌కు వెళ్లింది. రెండు హీట్స్‌ల నుంచి టాప్‌-3 టీమ్స్‌తో పాటు ఓవరాల్‌గా వారి తర్వాత అత్యంత వేగంగా పరిగెత్తిన రెండు టీమ్స్‌ ఫైనల్స్‌కు వెళతాయి. ఆ క్రమంలో భారత జట్టు మొత్తం 16 జట్లలో పదో స్థానంలో నిలిచింది. ఇక మహిళల 4X400మీ. రిలే క్వాలిఫికేషన్‌ హీట్‌2లో పోటీపడిన విథ్యా రామ్‌రాజ్‌, జ్యోతిక శ్రీ దండి, పూవమ్మ రాజు, శుభా వెంకటేషన్‌ 3:32.51 సెకన్ల టైమింగ్‌తో చివరిదైన 8వ స్థానంలో నిలిచారు.

Updated Date - Aug 10 , 2024 | 06:36 AM

Advertising
Advertising
<