ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

యూరో కింగ్‌ స్పెయిన్‌

ABN, Publish Date - Jul 16 , 2024 | 06:09 AM

యూరోపియన్‌ చాంపియన్‌షి్‌పలో స్పెయిన్‌ జైత్రయాత్ర సంచలనరీతిలో ముగిసింది. పుష్కరకాలం తర్వాత ఫైనల్‌కు చేరిన ఈ జట్టు టైటిల్‌ కోసం పట్టువదలకుండా పోరాడింది. ఆదివారం అర్ధరాత్రి ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో...

ప్రైజ్‌మనీ

స్పెయిన్‌కు: రూ. 72 కోట్లు

ఇంగ్లండ్‌కు: రూ. 45 కోట్లు

నాలుగు టైటిళ్లతో రికార్డు

ఫైనల్లో 2-1తో విజయం

ఇంగ్లండ్‌ మరో‘సారీ’

బెర్లిన్‌: యూరోపియన్‌ చాంపియన్‌షి్‌పలో స్పెయిన్‌ జైత్రయాత్ర సంచలనరీతిలో ముగిసింది. పుష్కరకాలం తర్వాత ఫైనల్‌కు చేరిన ఈ జట్టు టైటిల్‌ కోసం పట్టువదలకుండా పోరాడింది. ఆదివారం అర్ధరాత్రి ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో 2-1 తేడాతో ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది. తద్వారా ఏ జట్టుకూ సాధ్యంకాని రీతిలో ఏకంగా నాలుగో టైటిల్‌ను ఖాతాలో వేసుకుంది. వాస్తవానికి ఇరు జట్లు కూడా నువ్వా.. నేనా? అనే తరహాలో పోరాడిన తీరుకు ఎక్స్‌ట్రా సమయం తప్పదనిపించింది. కానీ ఆట చివర్లో స్ట్రయికర్‌ మైకేల్‌ ఓయర్జాబల్‌ (86) చేసిన మెరుపు గోల్‌తో విజయం అందుకుంది. గతం లో స్పెయిన్‌ 1964, 2008, 2012లో యూరో విజేతగా నిలిచింది. జట్టు తరఫున మరో గోల్‌ నికో విలియమ్స్‌ (47) సాధించాడు. అటు ఇంగ్లండ్‌ తరఫున ఏకైక గోల్‌ను సబ్‌స్టిట్యూట్‌ మిడ్‌ ఫీల్డర్‌ కోల్‌ పామర్‌ (73) అందించాడు. మరోవైపు 2020 యూరోలోనూ రన్నర్‌పగా నిలిచిన ఇంగ్లండ్‌ ఈసారి కూడా అదే ఫలితంతో సరిపెట్టుకుంది. అలాగే 1996 యూరో క్వార్టర్స్‌లో చివరిసారి ఈ రెండు జట్లు తలపడగా.. అప్పటి ఓటమికి స్పెయిన్‌ గట్టిగానే బదులుతీర్చుకుంది.


ఆఖర్లో అద్భుతం: ఫైనల్‌ మ్యాచ్‌ ఆరంభం నుంచే ఇరు జట్ల ఆటగాళ్లు బంతిని తమ ఆధీనంలో ఉంచుకునేందుకు ప్రయత్నించారు. దీంతో హోరాహోరీగా సాగిన తొలి అర్ధభాగంలో ఒక్క గోల్‌ కూడా నమోదు కాలేదు. 45వ నిమిషంలో ఇంగ్లండ్‌కు అవకాశం వచ్చినా సఫలం కాలేదు. ఇక రెండో భాగం 47వ నిమిషంలో లామినే యమాల్‌ అందించిన పాస్‌ను నికో విలియమ్స్‌ గోల్‌గా మల్చడంతో స్పెయిన్‌ ఖాతా తెరిచింది. అయితే 73వ నిమిషంలో ప్రత్యర్థి ఆటగాళ్లను ఏమార్చుతూ పామర్‌ నేరుగా సంధించిన బంతి గోల్‌పోస్టులోకి వెళ్లడంతో ఇంగ్లండ్‌ పోటీలోకి వచ్చింది. 1-1తో స్కోరు సమంగా మారిన వేళ.. పోటీ మరింత తీవ్రమైంది. అటు నిర్ణీత సమయం ముగుస్తున్నా మరో గోల్‌ నమోదు కాకపోవడంతో ఉత్కంఠ పెరిగింది. ఈ దశలో కుకురెల్లా లెఫ్ట్‌ వింగ్‌ వైపు బంతిని పాస్‌ చేయగా.. మెరుపు వేగంతో కదిలిన ఓయర్జాబల్‌ సిక్స్‌ యార్డ్‌ ఏరియా నుంచి బంతిని గోల్‌పోస్టులోకి పుష్‌ చేశాడు. అంతే.. స్పెయిన్‌ శిబిరంలో జోష్‌ ఆకాశాన్నంటింది. అయితే స్కోరును సమం చేసేందుకు 90వ నిమిషంలో ఇంగ్లండ్‌ ప్లేయర్ల రెండు హెడర్‌ ప్రయత్నాలను స్పెయిన్‌ అద్భుతంగా వమ్ము చేసి మ్యాచ్‌ను కాపాడుకోగలిగింది.


ఎదురుచూపులే..

సాకర్‌ పుట్టినిల్లుగా చెప్పుకొనే ఇంగ్లండ్‌ జట్టు దాదాపు ఆరు దశాబ్దాలుగా ఓ మేజర్‌ టైటిల్‌ కోసం ఎదురుచూస్తూనే ఉంది.1966లో చివరిసారిగా ఈ జట్టు ఫిఫా వరల్డ్‌క్‌పను గెలిచింది. అప్పటి నుంచీ ఎన్ని ప్రయత్నాలు చేసినా వారిని అదృష్టం మాత్రం వరించడం లేదు. వరుసగా రెండుసార్లు యూరో ఫైనల్‌కు చేరినా కప్‌ను అందుకోలేకపోవడం ఆ జట్టు అభిమానులను దారుణంగా నిరాశపరిచింది. టోర్నీ లో మెరుగ్గానే ఆడినా ఈ తుది పోరు ఓటమి తమను చాలాకాలం వెంటాడుతుందని కెప్టెన్‌ హ్యారీ కేన్‌ ఆవేదన వ్యక్తంచేశాడు.

1

యూరో చాంపియన్‌షి్‌పను అత్యధిక సార్లు (4) గెలిచిన జట్టుగా స్పెయిన్‌. అలాగే టోర్నీలో వరుసగా ఏడు మ్యాచ్‌లను గెలవడం కూడా ఏ టీమ్‌కైనా ఇదే తొలిసారి. దీంతోపాటు అత్యధిక గోల్స్‌ (15) కూడా స్పెయిన్‌ ఆటగాళ్లే సాధించారు.


యమాల్‌కు అవార్డు

స్పెయిన్‌ యువ ఫార్వర్డ్‌ లామినే యమాల్‌కు యంగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు దక్కింది. తాజా యూరోలో అతడు అత్యధికంగా నాలుగు గోల్స్‌లో భాగస్వామ్యం కాగా.. సెమీ్‌సలో గోల్‌ సాధించిన అతిపిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. యమాల్‌ శనివారమే 17వ వడిలోకి ప్రవేశించాడు.

Updated Date - Jul 16 , 2024 | 06:09 AM

Advertising
Advertising
<