ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నాలుగు గంటలు సాగినా.. ఫలితం తేలలేదు

ABN, Publish Date - Dec 05 , 2024 | 06:15 AM

ప్రపంచ చెస్‌ చాంపియన్‌షి్‌ప ఫైనల్లో డ్రా పరంపర కొనసాగుతోంది. బుధవారం జరిగిన ఎనిమిదో రౌండ్‌లోనూ ఫలితం తేలలేదు. దాంతో వరుసగా ఐదో గేమూ డ్రాగా ముగిసినట్టయ్యింది...

  • ఎనిమిదో గేమూ డ్రా ఫ ప్రపంచ చెస్‌

సింగపూర్‌: ప్రపంచ చెస్‌ చాంపియన్‌షి్‌ప ఫైనల్లో డ్రా పరంపర కొనసాగుతోంది. బుధవారం జరిగిన ఎనిమిదో రౌండ్‌లోనూ ఫలితం తేలలేదు. దాంతో వరుసగా ఐదో గేమూ డ్రాగా ముగిసినట్టయ్యింది. ఈ రౌండ్‌ అనంతరం లిరెన్‌, గుకేష్‌ చెరి నాలుగేసి పాయింట్లతో సమవుజ్జీలుగా నిలిచారు. 14 రౌండ్ల తుది పోరులో మొత్తంగా ఇది ఆరో డ్రా. 32 ఏళ్ల లిరెన్‌ తొలి గేమ్‌లో గెలుపొందగా, 18 ఏళ్ల గుకేష్‌ మూడో రౌండ్‌లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక 2,4,5,6,7,8 గేములు డ్రా అయ్యాయి. మరో నాలుగు రౌండ్‌లే మిగిలున్న నేపథ్యంలో రాబోయే రెండు గేములు కీలకం కానున్నాయి. ఇక..ఎనిమిదో రౌండ్‌ 4 గంటలపాటు హోరాహోరీగా సాగింది. తెల్లపావులతో బరిలోకి దిగిన లిరెన్‌కు పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో 41వ ఎత్తులోనే డ్రాకు ప్రతిపాదించాడు. కానీ గుకేష్‌ ఆ ప్రతిపాదనకు అంగీకరించకుండా గేమును కొనసాగించాడు. అయితే గేమ్‌ సాగేకొద్దీ తనకూ విజయావకాశాలు లేకపోవడంతో 51వ ఎత్తువద్ద గుకేష్‌ డ్రా చేసేందుకు అంగీకరించాడు.

Updated Date - Dec 05 , 2024 | 06:15 AM