ఆంధ్ర పోరాడినా..
ABN, Publish Date - Oct 22 , 2024 | 01:58 AM
ఆంధ్రతో జరిగిన రంజీ మ్యాచ్‌లో గుజరాత్ ఒక వికెట్‌తో విజయం సాధించింది. 144 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన గుజరాత్ జట్టును ఆంధ్ర స్పిన్నర్ లలిత్ మోహన్ (7/76) ముప్పుతిప్పలు...
అహ్మదాబాద్: ఆంధ్రతో జరిగిన రంజీ మ్యాచ్‌లో గుజరాత్ ఒక వికెట్‌తో విజయం సాధించింది. 144 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన గుజరాత్ జట్టును ఆంధ్ర స్పిన్నర్ లలిత్ మోహన్ (7/76) ముప్పుతిప్పలు పెట్టాడు. మ్యాచ్‌లో మొత్తం 10 వికెట్లను లలిత్ తన ఖాతాలో వేసుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో గుజరాత్ 9 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసి నెగ్గింది. అంతకుముందు ఫాలోఆన్‌లో ఓవర్‌నైట్ స్కోరు 203/4తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర 297 రన్స్‌కు ఆలౌటైంది. ఇక, తొలి ఇన్నింగ్స్‌లో గుజరాత్ 367కు, ఆంధ్ర 213 పరుగులకు ఆలౌటయ్యాయి.
Updated Date - Oct 22 , 2024 | 01:58 AM