ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పరువు కోసం పోరాటం

ABN, Publish Date - Oct 31 , 2024 | 01:23 AM

పుష్కరం తర్వాత సొంతగడ్డపై టెస్ట్‌ సిరీస్‌ చేజార్చుకొన్న భారత్‌.. కనీసం పరువు దక్కించుకోవాలనుకొంటోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి వాంఖడేలో న్యూజిలాండ్‌తో జరిగే ఆఖరి, మూడో టెస్ట్‌లో విజయమే లక్ష్యంగా...

ఒత్తిడిలో రోహిత్‌ సేన

  • న్యూజిలాండ్‌కు భలే చాన్స్‌

  • రేపటి నుంచి మూడో టెస్ట్‌

ఉదయం 9.30 నుంచి జియో సినిమాలో..

ముంబై: పుష్కరం తర్వాత సొంతగడ్డపై టెస్ట్‌ సిరీస్‌ చేజార్చుకొన్న భారత్‌.. కనీసం పరువు దక్కించుకోవాలనుకొంటోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి వాంఖడేలో న్యూజిలాండ్‌తో జరిగే ఆఖరి, మూడో టెస్ట్‌లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. మరోవైపు మూడు టెస్ట్‌ల సిరీ్‌సలో 2-0 ఆధిక్యంలో నిలిచిన కివీస్‌ వైట్‌వా్‌షతో సరికొత్త రికార్డు నెలకొల్పాలన్న ఆరాటంతో ఉంది. బెంగళూరు, పుణె టెస్టుల్లో టీమిండియా ఓటమికి ప్రధాన కారణం బ్యాటింగ్‌ వైఫల్యమే. గతంలో కూడా మన బ్యాటర్లు స్పిన్‌ను ఎదుర్కోవడంలో తడబడుతున్నా.. అశ్విన్‌, జడేజా తమ స్పిన్‌ మాయాజాలంతో ఆ లోటు కనిపించకుండా చేసేవారు. కానీ, కివీస్‌పై వీరిద్దరూ పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో.. బ్యాటింగ్‌ ఆర్డర్‌ బలహీనతలు బహిర్గతమయ్యాయి. సీనియర్‌ బ్యాటర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ ఆటతీరు తీవ్ర విమర్శలకు గురవుతోంది. స్పిన్‌ను ఎదుర్కోవాలంటే చక్కని ఫుట్‌వర్క్‌ అవసరం. కానీ, రోహిత్‌ క్రీజులో చురుగ్గా కదల్లేకపోతున్నాడు. ఆడిన నాలుగు ఇన్నింగ్స్‌లో 2, 52, 0, 8 పరుగులు చేసిన హిట్‌మ్యాన్‌.. మూడుసార్లు బౌల్డ్‌ అయ్యాడు. దీంతో అతడి వయసుపై చర్చ మొదలైంది. రోహిత్‌ కెప్టెన్సీని కూడా సీనియర్లు తప్పుబడుతున్నారు. ప్రత్యర్థిపై వ్యూహాత్మకంగా ఒత్తిడి పెంచలేదని విమర్శిస్తున్నారు.


కోహ్లీ కూడా పెద్దగా రాణించలేదు. ఒక్క అర్ధ శతకం మినహా మూడుసార్లు 0, 1, 17 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో వీరిద్దరూ జట్టుకు భారంగా మారారంటూ సోషల్‌ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి. ఓపెనర్‌ యశస్వీ జైస్వాల్‌ ఫర్వాలేదనిపించినా.. పంత్‌, జడేజా, అశ్విన్‌ పెద్ద స్కోర్లు చేయకపోవడం జట్టును ఆందోళనకు గురి చేస్తోంది. సర్ఫరాజ్‌ ఒక్క ఇన్నింగ్స్‌తో మురిపించినా.. మెలికలు తిరిగే వికెట్‌పై బోల్తాపడుతున్నాడు. ఇక, బౌలింగ్‌లో జట్టు ఎంతగానో ఆధారపడిన ఆఫ్‌ స్పిన్నర్లు జడేజా, అశ్విన్‌ తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేశారు. బుమ్రా కూడా తనదైన మార్క్‌ వేయలేకపోయినా.. కుల్దీప్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన వాషింగ్టన్‌ సుందర్‌ సత్తాచాటాడు. కాగా, ముంబై టెస్ట్‌కు పేసర్‌ ఆకాశ్‌దీ్‌ప స్థానంలో హర్షిత్‌ రాణాను బరిలోకి దించే అవకాశం ఉంది.


ఊడ్చేయాలని...

చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్‌ ఆత్మవిశ్వాసంతో తొణికిసలాడుతోంది. మూడో టెస్టును కూడా గెలిచి క్లీన్‌స్వీ్‌ప చేసి వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షి్‌ప ఫైనల్‌ అవకాశాలను మెరుగుపర్చుకోవాలనుకొంటోంది. ఎంతో అనుభవం ఉన్న కేన్‌ విలియమ్సన్‌ సిరీ్‌సకే దూరమైనా.. అలవోకగా గెలిచారు. రచిన్‌ రవీంద్ర, కాన్వే, యంగ్‌, కెప్టెన్‌ లాథమ్‌తో బ్యాటింగ్‌ బలంగా కనిపిస్తోంది. పుణె టెస్టులో శాంట్నర్‌ తన స్పిన్‌ మాయాజాలంతో మ్యాచ్‌ను శాసించాడు. అతడి నుంచి జట్టు మరోసారి అదే తరహా ప్రదర్శనను ఆశిస్తోంది. ఎజాజ్‌ పటేల్‌, ఫిలి్‌ప్సతోపాటు పేసర్‌ ఓరోక్‌ కూడా చక్కని సహకారం అందిస్తున్నాడు. మొత్తంగా చూస్తే వరుస ఓటములతో రగిలిపోతున్న భారత్‌.. ఈ మ్యాచ్‌లో విరుచుకుపడే చాన్సుంది. కానీ, అదను చూసి దెబ్బతీయడానికి కివీస్‌ వ్యూహాలు రచిస్తోంది.

జట్లు (అంచనా)

భారత్‌: రోహిత్‌ శర్మ, యశస్వి జైస్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌, కోహ్లీ, రిషభ్‌ పంత్‌, సర్ఫరాజ్‌, జడేజా, అశ్విన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, ఆకాశ్‌ దీప్‌/రాణా, బుమ్రా.

న్యూజిలాండ్‌: లాథమ్‌ (కెప్టెన్‌), కాన్వే, యంగ్‌, రచిన్‌, మిచెల్‌, బ్లండెల్‌ (కీపర్‌), ఫిలిప్స్‌, శాంట్నర్‌, సౌథీ, ఎజాజ్‌ పటేల్‌, ఓరోక్‌.


మళ్లీ స్పిన్‌ వికెట్‌

మూడో టెస్టుకు కూడా స్పిన్‌ వికెట్‌నే తయారు చేస్తున్నట్టు సమాచారం. టీమిండియా మేనేజ్‌మెంట్‌ కూడా కొన్ని సూచనలు చేసినట్టు తెలుస్తోంది. వాంఖడే ఎర్రమట్టి పిచ్‌ స్పిన్‌కు అనుకూలం. గత రెండు టెస్టుల్లో మెలికలు తిరిగే వికెట్‌పై తడబడినా.. మళ్లీ అదే తరహా వ్యూహాన్నే టీమిండియా అనుసరించనుందట. ఈ నేపథ్యంలో టాస్‌ కీలకం కానుంది.

35 మంది నెట్‌ బౌలర్లతో

కివీస్‌ స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కోవడానికి భారత జట్టు ముమ్మరంగా సాధన చేసింది. ముఖ్యంగా మూడో టెస్ట్‌కు కూడా మెలికలు తిరిగే పిచ్‌నే తయారు చేస్తారన్న వార్తలు వస్తుండడంతో.. ఆ దిశగా దృష్టి సారించింది. న్యూజిలాండ్‌ స్పిన్నర్‌ శాంట్నర్‌ భారత బ్యాటర్లను తీవ్రంగా ఇబ్బందిపెట్టాడు. ఈ నేపథ్యంలో మొత్తంగా 35 మంది నెట్‌ బౌలర్లతో మనోళ్లకు బంతులేయించారు. వీరిలో ఎక్కువ మంది స్పిన్నర్లే. బుధవారం జరిగిన నెట్‌ సెషన్‌లో భారత ఆటగాళ్లందరూ తీవ్రంగా శ్రమించారు. కోహ్లీ పూర్తిగా షాట్లు ఆడుతూ కనిపించాడు. క్రీజు వైట్‌లైన్లను ప్రత్యేకంగా పొడిగించి.. వేర్వేరు చోట్ల బంతులేస్తూ బ్యాటర్లను పరీక్షించారు. వికెట్‌పై ఉదయం పచ్చిక కనిపించినా.. తేమను బయటకు తీసేందుకు బరువైన రోలర్‌తో చదును చేశారు. అయితే, సాయంత్రానికి పిచ్‌పై కొద్దిగా నీళ్లు చల్లి మళ్లీ తేలికైన రోలర్‌తో చదును చేశారు.

స్వదేశంలో చివరిసారి 2000లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్‌ 0-2తో వైట్‌వా్‌షకు గురైంది.

Updated Date - Oct 31 , 2024 | 01:23 AM