పారిస్‌లో తొలి డోపీ

ABN, Publish Date - Jul 27 , 2024 | 06:19 AM

పారిస్‌ ఒలింపిక్స్‌లో తొలి డోపీ దొరికాడు. ఇరాక్‌ దేశానికి చెందిన జూడో క్రీడాకారుడు సజ్జాద్‌ సెహెన్‌ డోపింగ్‌ పరీక్షలో పాజిటివ్‌గా తేలాడు. తొలిసారి విశ్వక్రీడల్లో పోటీపడుతున్న 28 ఏళ్ల సజ్జాద్‌ రెండు రకాల

పారిస్‌లో తొలి డోపీ

ఇరాక్‌ జూడోకాపై వేటు

పారిస్‌: పారిస్‌ ఒలింపిక్స్‌లో తొలి డోపీ దొరికాడు. ఇరాక్‌ దేశానికి చెందిన జూడో క్రీడాకారుడు సజ్జాద్‌ సెహెన్‌ డోపింగ్‌ పరీక్షలో పాజిటివ్‌గా తేలాడు. తొలిసారి విశ్వక్రీడల్లో పోటీపడుతున్న 28 ఏళ్ల సజ్జాద్‌ రెండు రకాల నిషేధిత ఉత్ర్పేరకాలు వాడినట్టు రుజువైందని అంతర్జాతీయ డోపింగ్‌ పరీక్షల సంస్థ శుక్రవారం ప్రకటించింది. సజ్జాద్‌ వచ్చే మంగళవారం తన 81 కిలోల విభాగంలో తలపడాల్సి ఉంది. ఇంతలోనే డోపీగా పట్టుబడడంతో ప్రస్తుతానికి అతనిపై తాత్కాలిక సస్పెన్షన్‌ విధించారు. ఫలితంగా అతడు విశ్వక్రీడల నుంచి వైదొలగక తప్పని పరిస్థితి.

Updated Date - Jul 27 , 2024 | 06:20 AM

Advertising
Advertising
<