T20 World Cup India vs Ireland : బోణీ అదిరింది..!
ABN, Publish Date - Jun 06 , 2024 | 04:54 AM
టీ20 వరల్డ్‌క్‌పను భారత జట్టు భారీ విజయంతో ఆరంభించింది. రోహిత్ శర్మ (37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 52 రిటైర్డ్ హర్ట్) అర్ధ శతకంతోపాటు పేసర్లు అదరగొట్టడంతో.. గ్రూప్-ఎలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత్...
నేటి మ్యాచ్‌లు
పపువా న్యూగినీ X ఉగాండా (ఉ.5 గం.)
ఆస్ర్టేలియా X ఒమన్ (ఉ.6 గం.)
పాకిస్థాన్ X అమెరికా (రాత్రి 9 గం.)
రోహిత్ అర్ధ శతకం
చెలరేగిన పేసర్లు
8 వికెట్లతో టీమిండియా ఘన విజయం
ఐర్లాండ్ చిత్తు
న్యూయార్క్: టీ20 వరల్డ్‌క్‌పను భారత జట్టు భారీ విజయంతో ఆరంభించింది. రోహిత్ శర్మ (37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 52 రిటైర్డ్ హర్ట్) అర్ధ శతకంతోపాటు పేసర్లు అదరగొట్టడంతో.. గ్రూప్-ఎలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో ఐర్లాండ్‌ను చిత్తు చేసింది. తొలుత ఐర్లాండ్ 16 ఓవర్లలో 96 పరుగులకు కుప్పకూలింది. గారెత్ డిలానె (26) టాప్ స్కోరర్. హార్దిక్ పాండ్యా 3 వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, అర్ష్‌దీప్ చెరో 2 వికెట్లు దక్కించుకొన్నారు. అనంతరం ఛేదనలో భారత్ 12.2 ఓవర్లలో 97/2 స్కోరు చేసి గెలిచింది. రిషభ్ పంత్ (26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 36 నాటౌట్) రాణించాడు. అడైర్, వైట్ చెరో వికెట్ పడగొట్టారు. పొదుపుగా బౌలింగ్ చేసిన బుమ్రా (2/6)కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
సునాయాసంగా కొట్టేశారు..: స్వల్ప లక్ష్య ఛేదనలో ఓపెనర్ కోహ్లీ (1) విఫలమైనా.. రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో ముందుండి నడిపించాడు. పంత్‌తో కలసి రెండో వికెట్‌కు 54 పరుగులు జోడించడంతో టీమిండియా అలవోకగా నెగ్గింది. రెండో ఓవర్‌లో లిటిల్ బౌలింగ్‌లో 4,6 బాదిన రోహిత్ మొత్తం 15 రన్స్ రాబట్టాడు. అయితే, ఆ తర్వాతి ఓవర్‌లో అడైర్ బౌలింగ్‌లో కోహ్లీ భారీ షాట్ ఆడే క్రమంలో క్యాచవుటయ్యాడు. దీంతో తొలి వికెట్‌కు 22 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. పంత్.. వీలుచిక్కినప్పుడల్లా షాట్లు ఆడుతూ స్కోరు బోర్డును నడిపించాడు. దీంతో పవర్‌ప్లేలో భారత్ 39/1తో నిలిచింది. పదో ఓవర్‌లో ఫిఫ్టీ పూర్తి చేసుకొన్న రోహిత్ 76/1 స్కోరు వద్ద రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడాడు. విజయానికి 6 పరుగులు కావాల్సి ఉండగా సూర్యకుమార్ (2)ను వైట్ అవుట్ చేశాడు. అయితే, సిక్స్ బాదిన పంత్.. మరో 46 బంతులు మిగిలుండగానే మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు.
పెవిలియన్‌కు క్యూ..: బౌలింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై టీమిండియా పేసర్లు చెలరేగడంతో.. ఐర్లాండ్ బ్యాటింగ్ పేకమేడను తలపించింది. 50/8తో ఇన్నింగ్స్ ఎంతోసేపు సాగదనుకొన్న సమయంలో.. డిలానె ఆదుకోవడంతో కనీసం వంద పరుగుల మార్క్‌కైనా చేరువైంది. జోష్ లిటిల్ (14)తో కలసి తొమ్మిదో వికెట్‌కు 27 పరుగులు జోడించిన డిలానె.. బెన్ వైట్ (2 నాటౌట్)తో కలసి పదో వికెట్‌కు 19 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ధాటిగా ఆడే ప్రయత్నం చేసిన లిటిల్‌ను బుమ్రా బౌల్ట్ చేశాడు. అయితే, అర్ష్‌దీప్ వేసిన 16వ ఓవర్‌లో 4,6,4తో గేర్ మార్చిన డిలానె.. ఫ్రీహిట్ బాల్‌కు రనౌట్ కావడంతో ఐర్లాండ్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్‌ను అర్ష్‌దీప్ ఆరంభంలోనే దెబ్బకొట్టాడు. మూడో ఓవర్‌లోనే ఓపెనర్లు పాల్ స్టిర్లింగ్ (2), ఆండ్రూ బాల్‌బిర్నీ (5)లను అవుట్ చేశాడు. మధ్య ఓవర్లలో హార్దిక్ పాండ్యా కూడా విజృంభించడంతో ఐరిష్ టీమ్ కోలుకోలేక పోయింది. వన్‌డౌన్‌లో వచ్చిన టకర్ (10)ను పాండ్యా పెవిలియన్ చేర్చగా.. టెక్టర్ (4)ను బుమ్రా క్యాచవుట్ చేశాడు. తర్వాత హార్దిక్ బౌలింగ్‌లో క్యాంఫర్ (12) అవుటయ్యాడు. ఆ వెంటనే జార్జ్ డాక్రెల్ (3)ను సిరాజ్ పెవిలియన్ చేర్చడంతో 10 ఓవర్లు ముగిసే సరికి ఐర్లాండ్ 49/6తో నిలిచింది. అడైర్ (3)ను పాండ్యా అవుట్ చేయగా.. మెకార్తీ (0)ని అక్షర్ అద్భుతమైన రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు.
స్కోరుబోర్డు
ఐర్లాండ్: బాల్‌బిర్నీ (బి) అర్ష్‌దీప్ 5, స్టిర్లింగ్ (సి) పంత్ (బి) అర్ష్‌దీప్ 2, టకర్ (బి) హార్దిక్ 10, టెక్టర్ (సి) విరాట్ (బి) బుమ్రా 4, కర్టిస్ (సి) పంత్ (బి) హార్దిక్ 12, డాక్రెల్ (సి) బుమ్రా (బి) సిరాజ్ 3, డిలానె (రనౌట్-సిరాజ్/పంత్) 26, అడైర్ (సి) దూబే (బి) హార్దిక్ 3, మెకార్తి (సి అండ్ బి) అక్షర్ 0, లిటిల్ (బి) బుమ్రా 14, బెన్ వైట్ (నాటౌట్) 2, ఎక్స్‌ట్రాలు: 15, మొత్తం: 16 ఓవర్లలో 96 ఆలౌట్; వికెట్ల పతనం: 1-7, 2-9, 3-28, 4-36, 5-44, 6-46, 7-49, 8-50, 9-77, 10-96; బౌలింగ్: అర్ష్‌దీప్ 4-0-35-2, సిరాజ్ 3-0-13-1, బుమ్రా 3-1-6-2, హార్దిక్ 4-1-27-3, అక్షర్ 1-0-3-1, జడేజా 1-0-7-0.
భారత్: రోహిత్ (రిటైర్డ్ హర్ట్) 52, విరాట్ (సి) వైట్ (బి) అడైర్ 1, పంత్ (నాటౌట్) 36, సూర్యకుమార్ (సి) డాక్రెల్ (బి) వైట్ 2, శివమ్ దూబే (నాటౌట్) 0, ఎక్స్‌ట్రాలు: 6, మొత్తం: 12.2 ఓవర్లలో 97/2; వికెట్ల పతనం: 1-22, 1-76, 2-91; బౌలింగ్: అడైర్ 4-0-27-1, లిటిల్ 4-0-42-0, మెకార్తి 2.2-0-18-0, కాంప్హర్ 1-0-4-0, వైట్ 1-0-6-1.
1
అత్యధిక విజయాలు సాధించిన టీ20 కెప్టెన్‌గా ధోనీ (43 మ్యాచ్‌లు)తో సమంగా రోహిత్.
4
మిగిలి ఉన్న బంతుల పరంగా (46) టీమిండియాకు ఇది నాలుగో అతిపెద్ద విజయం. స్కాట్లాండ్ (81 బంతులు), బంగ్లా (64), యూఏఈ (59)పై భారత్ భారీ గెలుపులను నమోదు చేసింది.
8
టీ20ల్లో ఐర్లాండ్‌పై టీమిండియాకు ఇది వరుసగా 8వ విజయం
రోహిత్‌కు గాయం?
మ్యాచ్ మధ్యలో రోహిత్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. లిటిల్ వేసిన 9వ ఓవర్ రెండో బంతి శర్మ కుడి చేతిని తాకింది. కానీ, ఆ తర్వాతి ఓవర్ ముగిశాక ఫిజియోతో కలసి మైదానం వీడాడు. దీంతో ఆదివారం పాకిస్థాన్‌తో మ్యాచ్ ఉండడంతో.. రోహిత్‌కు ఏదైనా గాయమైందనే ఆందోళన ఫ్యాన్స్‌లో వ్యక్తమవుతోంది. పంత్ మోచేతికి కూడా బంతి బలంగా తగిలింది.
Updated Date - Jun 06 , 2024 | 05:08 AM