ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కమాన్‌ కోహ్లీ

ABN, Publish Date - Nov 19 , 2024 | 06:37 AM

టెస్టు సిరీస్‌ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించడం విరాట్‌ కోహ్లీకిదే ఆఖరు కానుందని మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ అభిప్రాయపడ్డాడు. అక్కడ తనకిదే చివరిదని విరాట్‌కు కూడా తెలుసన్న

న్యూఢిల్లీ: టెస్టు సిరీస్‌ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించడం విరాట్‌ కోహ్లీకిదే ఆఖరు కానుందని మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ అభిప్రాయపడ్డాడు. అక్కడ తనకిదే చివరిదని విరాట్‌కు కూడా తెలుసన్న దాదా.. ఆ సిరీ్‌సతో కచ్చితంగా ఫామ్‌లోకి వస్తాడన్న విశ్వాసముందన్నాడు. ఇటీవల స్వదేశంలో టెస్టు సిరీ్‌సలో పేలవ ప్రదర్శనతో కోహ్లీ ఇంటాబయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ‘విరాట్‌ ఓ చాంపియన్‌ బ్యాటర్‌. ఆసీస్‌ గడ్డపై అతడికి మెరుగైన రికార్డుంది. 2014లో నాలుగు, 2018లో ఓ శతకం బాదాడు. ఆసీ్‌సలో టెస్టు సిరీస్‌ కోసం పర్యటించడం ఇదే ఆఖరు అనే విషయం అతడికి కూడా తెలుసు. అందుకే విరాట్‌ ఈసారి ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటాడు. ఇక కివీ్‌సతో సిరీ్‌సలో పిచ్‌లు బ్యాటింగ్‌కు ఏమాత్రం అనుకూలించలేదు. కానీ ఆసీస్‌ పిచ్‌లు అలా కాదు. అక్కడ అతడికి కొట్టిన పిండి. అందుకే కచ్చితంగా తనకు అనుకూలమైన చోట అద్భుతంగా రాణిస్తాడన్న నమ్మకం నాకుంది’ అని గంగూలీ తెలిపాడు.

కసిగా ఆడతాడు

విరాట్‌ ప్రస్తుతం ఫామ్‌లో లేకపోయినా ఆసీ్‌సతో సిరీ్‌సలో కసిగా ఆడతాడని మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌ కూడా అన్నాడు. ‘కివీ్‌సపై విఫలమైన కోహ్లీ ఆసీ్‌సపై పరుగులు సాధించాలనే ఆతృతలో ఉన్నాడు. తొలి టెస్టు జరిగే పెర్త్‌ మైదానంలో అతడు 2018లో సెంచరీ సాధించాడు. ఇది విరాట్‌కు ఆత్మవిశ్వాసాన్నిస్తుంది. క్రీజులో కాస్త కుదురుకుంటే ఇక అతడిని ఆపడం కష్టమే’ అని గవాస్కర్‌ పేర్కొన్నాడు.

Updated Date - Nov 19 , 2024 | 06:37 AM