ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gautam - Kohli: గంభీర్, కోహ్లీ కలిసి పని చేస్తారా? వారిద్దరూ బీసీసీఐకి ఇచ్చిన క్లియర్ మెసేజ్ ఏంటంటే..!

ABN, Publish Date - Jul 19 , 2024 | 10:39 AM

మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ అయిన నేపథ్యంలో స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉదయించింది. వీరిద్దరికి గతంలో చాలా సార్లు గొడవలయ్యాయి. గతేడాది ఐపీఎల్ మ్యాచ్ సమయంలో ఇద్దరూ మైదానంలోనే వాగ్వాదానికి దిగారు.

Gautam Gambhi, Virat Kohli

మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) టీమిండియా హెడ్ కోచ్ (Head Coach) అయిన నేపథ్యంలో స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli) పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉదయించింది. వీరిద్దరికి గతంలో చాలా సార్లు గొడవలయ్యాయి. గతేడాది ఐపీఎల్ (IPL) మ్యాచ్ సమయంలో ఇద్దరూ మైదానంలోనే వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత కూడా ఇద్దరూ సోషల్ మీడియా ద్వారా ఆ వివాదాన్ని కొనసాగించారు. ఇప్పుడు గంభీర్ టీమిండియాకు హెడ్ కోచ్ అయ్యాడు. అతడి మార్గనిర్దేశకత్వంలో కోహ్లీ ఆడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇద్దరూ కలిసి సుహృద్భావపూరిత వాతావరణంలో పని చేస్తారా? అనే అనుమానం అందరిలో ఉంది.


గంభీర్‌ను హెడ్ కోచ్‌గా నియమించే సందర్భంలోనే బీసీసీఐ (BCCI) పెద్దలు కోహ్లీతో మాట్లాడారట. గంభీర్‌తో తన బంధం గురించి కోహ్లీ బీసీసీఐకి క్లియర్ మెసేజ్ ఇచ్చాడట. ``గంభీర్‌కు, నాకు మధ్య ఉన్న అంశాలు జట్టు ప్రయోజనాలను దెబ్బతీయవు. మా మధ్య విభేదాలు జట్టుతో నా సంబంధాన్ని ప్రభావితం చేయబోవు. జట్టు ప్రయోజనాల కోసం గంభీర్‌తో కలిసి పని చేయడానికి సిద్ధమేన``ని కోహ్లీ స్పష్టం చేశాడట. కోహ్లీతో తన బంధం గురించి గంభీర్ గతంలోనే ఓ మీడియా సమావేశంలో మాట్లాడాడు.


``కోహ్లీ, నా విషయంలో ప్రజల అవగాహన వాస్తవానికి చాలా దూరంగా ఉంది. కోహ్లీతో నా బంధం గురించి దేశ ప్రజలకు తెలియాల్సిన అవసరం లేదు. జట్టు కోసం పోరాడే హక్కు నాకు ఎంతో ఉందో, కోహ్లీకి కూడా అంతే ఉంది. మా అనుబంధం దేశ ప్రజలకు మసాలా ఇవ్వాల్సిన అవసరం లేదు`` అంటూ గంభీర్ పేర్కొన్నాడు. త్వరలో శ్రీలంకలో జరిగే వన్డే సిరీస్‌ కోసం గంభీర్, కోహ్లీ కలిసి పని చేయాల్సిన అవసరం ఉంది.

ఇవి కూడా చదవండి..

Ishan Kishan: ఇషాన్ కిషన్ మళ్లీ జట్టులోకి రావడానికి మార్గాలున్నాయా? అలా చేస్తేనే ఇక ఛాన్స్..!


Cricket: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. వైరల్ అవుతున్న గంభీర్ నాలుగేళ్ల క్రితం ట్వీట్..


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 19 , 2024 | 10:39 AM

Advertising
Advertising
<