Gautam Gambhir: గంభీర్ పూర్తి కాలం పదవిలో ఉండలేడు.. వరల్డ్ కప్ హీరో సంచలన వ్యాఖ్యలు!
ABN, Publish Date - Aug 04 , 2024 | 04:53 PM
రెండోసారి టీమిండియా టీ20 ప్రపంచకప్ సాధించిన తర్వాత హెడ్ కోచ్ పదవి నుంచి రాహుల్ ద్రవిడ్ వైదొలిగాడు. అతడి స్థానంలో గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. 2027 చివరి వరకు టీమిండియా హెడ్‌కోచ్‌గా గంభీర్ తన సేవలు అందించాల్సి ఉంటుంది.
రెండోసారి టీమిండియా టీ20 ప్రపంచకప్ (T20 Worldcup) సాధించిన తర్వాత హెడ్ కోచ్ పదవి నుంచి రాహుల్ ద్రవిడ్ వైదొలిగాడు. అతడి స్థానంలో గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) హెడ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. 2027 చివరి వరకు టీమిండియా హెడ్‌కోచ్‌గా (India Coach) గంభీర్ తన సేవలు అందించాల్సి ఉంటుంది. అయితే గంభీర్ అప్పటివరకు టీమిండియా కోచ్‌గా కొనసాగడం కష్టమేనని 2007 ప్రపంచకప్ హీరో జోగిందర్ శర్మ (Joginder Sharma) వ్యాఖ్యానించాడు. గంభీర్ మనస్తత్వాన్ని బట్టి చూస్తే అతడు ఎక్కువ కాలం టీమిండియా కోచ్‌గా ఉండలేడని శర్మ అభిప్రాయపడ్డాడు.
``టీమిండియా హెడ్ కోచ్‌గా గంభీర్ ఎక్కువ కాలం కొనసాగలేడు. అతడిపై నాకు వ్యక్తిగతంగా ఎలాంటి కోపం, ఈర్ష్య లేవు. గంభీర్ ఎప్పుడూ సొంతంగా నిర్ణయాలు తీసుకుంటుంటాడు. జట్టులోని ఇతరులతో ఒక్కోసారి ఏకీభవించడు. విరాట్ కోహ్లీ అని మాత్రమే కాదు.. ఇతర ఆటగాళ్లు కూడా గంభీర్ నిర్ణయాలను ఇష్టపడకపోవచ్చు. గంభీర్ ముక్కుసూటి మనిషి. మనసులోని మాటలను నేరుగా చెబుతాడు. ఇతరులు ఏమనుకుంటారని పట్టించుకోడు. అవతలి వ్యక్తిని పొగడ్తలతో బుట్టలో వేసెద్దామనే ఆలోచన ఉండదు. చాలా నిజాయితీతో, నిబద్ధతతో పని చేయాలని అనుకుంటాడు. అందుకే అతడు ఎక్కువ కాలం పదవిలో కొనసాగలేడని అనుకుంటున్నా`` అంటూ జోగిందర్ అన్నాడు.
2007 టీ20 ప్రపంచకప్‌లో జోగిందర్ బౌలర్‌గా తన సేవలందించాడు. పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో చివరి ఓవర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. దూకుడుగా ఆడుతున్న పాక్ బ్యాట్స్‌మెన్ మిస్బావుల్ హక్‌ను బోల్తా కొట్టించి భారత్‌ను గెలిపించాడు.
ఇవి కూడా చదవండి..
Paris Olympics: సెమీస్‌లో నిరాశపర్చిన లక్ష్యసేన్..
Rohit Sharma: మరో 7 పరుగుల దూరం.. ధోనీ రికార్డు బ్రేక్ చేసేందుకు చేరువైన రోహిత్ శర్మ
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Aug 04 , 2024 | 04:53 PM