ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Virat Kohli: టీవీ చూస్తూ చెప్పడానికి బాగానే ఉంటుంది.. కానీ, కోహ్లీని మాత్రం అలాగే ఆడించాలి: గవాస్కర్

ABN, Publish Date - Jun 02 , 2024 | 08:26 PM

క్రికెట్ ప్రేమికులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన టీ-20 ప్రపంచకప్ ప్రారంభమైపోయింది. అమెరికా-వెస్టిండీస్ వేదికగా జరుగుతోంది. ఈ మెగా టోర్నీకి ముందు బంగ్లాదేశ్‌తో జరిగిన వామప్ మ్యాచ్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. 60 పరుగుల తేడాతో బంగ్లాను చిత్తు చేసింది.

sunil gavaskar

క్రికెట్ ప్రేమికులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన టీ-20 ప్రపంచకప్ (T20 Worldcup) ప్రారంభమైపోయింది. అమెరికా-వెస్టిండీస్ వేదికగా జరుగుతోంది. ఈ మెగా టోర్నీకి ముందు బంగ్లాదేశ్‌తో జరిగిన వామప్ మ్యాచ్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది (India vs Bangladesh). 60 పరుగుల తేడాతో బంగ్లాను చిత్తు చేసింది. ఈ టోర్నీ ప్రారంభానికి ముందు నుంచి టీమిండియా ఓపెనింగ్ జోడీపై డిస్కషన్ జరుగుతూనే ఉంది. మాజీలు తమ అభిప్రాయాలను ఒక్కోలా వెల్లడించారు. తాజాగా ఈ వ్యవహారంపై సునీల్ గవాస్కర్ స్పందించాడు (Sunil Gavaskar).


``చాలా మంది లెఫ్ట్ హ్యాండ్-రైట్ హ్యాండ్ కాంబినేషన్ జోడీ ఓపెనింగ్ అయితే బాగుంటుంది అంటున్నారు. రోహిత్‌తో పాటు ఓ లెఫ్ట్ హ్యాండర్‌ను ఓపెనింగ్‌కు పంపాలంటున్నారు. కానీ, గొప్ప ఫామ్‌లో ఉన్న కోహ్లీని (Virat Kohli) ఓపెనింగ్‌కు పంపితేనే మంచిది. రోహిత్, కోహ్లీ జోడీని మంచి ఓపెనింగ్ కాంబినేషన్ ప్రస్తుతానికి లేదు. టీవీ ముందు కూర్చుని సలహా ఇవ్వడానికి బాగానే ఉంటుంది. కానీ, కోహ్లీని బ్యాటింగ్ కోసం ఎదురుచూస్తూ డగౌట్‌లో కూర్చునేలా చేయడం మంచి ఆలోచన కాదు`` అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.


``కోహ్లీ గొప్ప టచ్‌లో ఉన్నాడు. ఒక ఓవర్ లేదా ఐదు బంతుల తర్వాత అతడు బ్యాటింగ్‌కు వస్తాడు కదా అనుకోవచ్చు. కానీ, ఒకరు అవుట్ అయిన తర్వాత బ్యాటింగ్‌కు దిగుతున్నాం అనే ఫీలింగ్ చాలా మార్పు కలిగిస్తుంది. మంచి ఫామ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్ ఎంత త్వరగా బ్యాటింగ్‌కు దిగితే అంత మంచిద``ని గవాస్కర్ పేర్కొన్నాడు. భారత్ ఈ నెల ఐదో తేదీన ఐర్లాండ్‌తో ఈ టోర్నీలో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఇక, ఆదివారం నాడు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది.

ఇవి కూడా చదవండి..

T20 Worldcup: వారెవ్యా.. అర్ష్‌దీప్ వేసిన బంతి చూస్తే షాకవ్వాల్సిందే.. లిటన్ దాస్‌ను ఎలా అవుట్ చేశాడో చూడండి..


Hardik Pandya: జీవితంలో చాలా చెడును ఎదుర్కొన్నా.. నేనెప్పుడూ భయపడి పారిపోను: హార్దిక్ పాండ్యా


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 02 , 2024 | 08:26 PM

Advertising
Advertising