ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఫెడ్‌క్‌పలో నీరజ్‌కు స్వర్ణం

ABN, Publish Date - May 16 , 2024 | 04:55 AM

టోక్యో ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత నీరజ్‌ చోప్రా, మరో రెండు నెలల్లో జరగనున్న పారిస్‌ ఒలింపిక్స్‌కు ముందు సొంతగడ్డపై పసిడి పతకం సాధించి, సత్తా చాటాడు...

హెప్టాథ్లాన్‌లో తెలుగమ్మాయి నందినికి పసిడి

భువనేశ్వర్‌: టోక్యో ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత నీరజ్‌ చోప్రా, మరో రెండు నెలల్లో జరగనున్న పారిస్‌ ఒలింపిక్స్‌కు ముందు సొంతగడ్డపై పసిడి పతకం సాధించి, సత్తా చాటాడు. బుధవారం జరిగిన ఫెడరేషన్‌ కప్‌లో 26 ఏళ్ల నీరజ్‌ జావెలిన్‌ను 82.27 మీటర్ల దూరం విసిరి, ప్రథమ స్థానంలో నిలిచాడు. తొలి మూడు రౌండ్లు పూర్తయ్యేసరికి ద్వితీయ స్థానంలో నిలిచిన నీరజ్‌, నాలుగో రౌండ్‌లో పుంజుకుని ప్రథమ స్థానానికి చేరుకున్నాడు. 2021 తర్వాత నీరజ్‌ పాల్గొన్న తొలి దేశవాళీ పోటీ ఇదే కావడం విశేషం. ఇదే విభాగంలో డీపీ మను రెండో స్థానంలో నిలిచి, రజతం నెగ్గాడు. ఆసియా క్రీడల కాంస్యపతక విజేత, సంగారెడ్డి జిల్లాకు చెందిన అగసర నందిని హెప్టాథ్లాన్‌లో స్వర్ణంతో మెరిసింది. నందిని మొత్తంగా 5,460 పాయింట్లు సాధించి, అగ్రస్థానంలో నిలిచింది. ఇక, 100 మీటర్ల స్ర్పింట్‌లో హైదరాబాద్‌ అమ్మాయి నిత్య నాలుగో స్థానంలో నిలిచి కొద్దిలో కాంస్య పతకం కోల్పోయింది. పురుషుల 100 మీటర్ల స్ర్పింట్‌లో నెల్లూరు అథ్లెట్‌ శ్రీనివా్‌స ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

Updated Date - May 16 , 2024 | 04:55 AM

Advertising
Advertising