ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gukesh: ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా గుకేష్..

ABN, Publish Date - Dec 12 , 2024 | 06:58 PM

భారత చెస్ ఛాంపియన్ గుకేష్ ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నాడు. అతి పిన్నవయసులో అరుదైన ఘనత సాధించి దేశం కీర్తిని నిలబెట్టాడు. ప్రపంచ చెస్ ఛాంపియన్ ఫైనల్స్ లో విజయం సాధించాడు....

Gukesh Dommaraju

ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్‌లో భారత్ అరుదైన ఘనత సాధించింది. భారత చెస్ ప్లేయర్ గుకేష్ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. చివరి గేమ్ 14లో చైనీస్ ప్లేయర్ డింగ్ లిరెన్ ను ఈ 18 ఏళ్ల గ్రాండ్ మాస్టర్ ఓడించి చరిత్ర సృష్టించాడు. క్రీడా చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన ప్రపంచ ఛాంపియన్‌గా చరిత్ర సృష్టించాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ టైటిల్‌ను గెలుచుకున్న లెజెండరీ విశ్వనాథన్ ఆనంద్ తర్వాత రెండో భారీతీయ గ్రాండ్ మాస్టర్ గా నిలిచాడు. మ్యాచ్ లో 13 రోలర్ కోస్టర్ గేమ్స్ తర్వాత ఆఖరి పోరులో గుకేష్ ఈ టైటిల్ ను కైవసం చేసుకున్నాడు. పోటీదారులు ఇద్దరూ 6.5 పాయంట్లు సాధించారు. దీంతో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.


పద్దెనిమిదేళ్లకే ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన గుకేష్ విశ్వనాథన్ ఆనంద్ రికార్డును బ్రేక్ చేశాడు. అతడి తర్వాత ఈ ఘనత సాధించిన ఏకైక వ్యక్తిగా నిలిచాడు. చెన్నైకి చెందిన గుకేష్.. మే 29, 2006లొ జన్మించాడు. అతడి తండ్రి డాక్టర్ రజనీకాంత్ ప్రఖ్యాత ఈ ఎన్ టీ నిపుణుడు. తల్లి డాక్టర్ పద్మ మైక్రోబయాలజిస్టు. ఏడేళ్ల వయసులో గుకేష్.. తన టాలెంట్ ను తొలిసారి బయటపెట్టాడు.

2015 నాటికి అతడికి ఆసియా స్కూల్ ఆఫ్ చెస్ ఛాంపియన్ షిప్ లో అండర్-9 విభాగంలో గెలుపొందాడు. దీంతో చెస్ క్రీడలో తనదైన ముద్ర వేసుకున్నాడు. 2018లో అతను ప్రపంచ యూత్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో విజయం సాధించాడు. ఆసియా యూత్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో అద్భుతమైన ఐదు బంగారు పతకాలను సాధించాడు. అతను 2017లో అంతర్జాతీయ మాస్టర్‌గా, రెండు సంవత్సరాల తర్వాత, చెస్ చరిత్రలో మూడవ అతి పిన్న వయస్కుడైన గ్రాండ్‌మాస్టర్‌గా మారిన గుకేష్ ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చాడు.


ఎత్తుకు పైఎత్తు వేసి..

తాజాగా సింగపూర్‌లో జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ గుకేశ్ సత్తాకు అంతిమ పరీక్షగా మారింది. డింగ్ లిరెన్‌తో జరిగిన ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. 13 గేమ్‌ల తర్వాత 6.5-6.5తో టై అయింది. ఛాంపియన్‌ను నిర్ణయించే చివరి క్లాసికల్ గేమ్‌తో, గుకేష్ అద్భుతమైన వ్యూహాత్మక నైపుణ్యం, ఖచ్చితత్వాన్ని ప్రదర్శించాడు. చివరి రౌండ్ చివరి గేమ్‌లో గుకేశ్ ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. డింగ్‌ను డిఫెన్సివ్ పొజిషన్‌లోకి నెట్టడానికి అదనపు బంటును ఉపయోగించుకున్నాడు. గుకేష్ ఎత్తుకు డింగ్ ఓటమిని అంగీకరించడంతో భారత్ చరిత్ర స‌ష్టించింది. 18 సంవత్సరాల అతి పిన్న వయస్కుడైన ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేష్ నిలిచాడు.

భారత్‌కు మైలురాయి..

గుకేష్ సాధించిన ఈ విజయం అతడి వ్యక్తిగతం మాత్రమే కాదు.. భారత చెస్‌లో ఓ మైలురాయి. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత భారతదేశం చెస్ ప్రపంచంలో శిఖరాగ్రానికి చేరుకోవడంలో గుకేష్ కీలక పాత్ర పోషించాడు. అతని విజయం కొత్త తరం భారతీయ చెస్ కు ప్రతీకగా నిలుస్తుంది.

ఏపీ సీఎం ప్రశంసలు..

‘‘మన తెలుగు కుర్రాడు, ఇండియన్ గ్రాండ్‌మాస్టర్‌కి హృదయపూర్వక అభినందనలు. కేవలం 18 ఏళ్లకే ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన చెస్ ఛాంపియన్‌గా అవతరించి సింగపూర్‌ వేదికగా చరిత్ర సృష్టించడం గర్వకారణం. మీ అద్భుతమైన విజయాన్ని దేశం మొత్తం సంబరంగా జరుపుకుంటోంది. రాబోయే దశాబ్దాలలో మీరు మరెన్నో విజయాలు, ప్రశంసలు పొందాలని కోరుకుంటున్నాను’’ అంటూ ఏపీ సీఎం చంద్రబాబు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

MS Dhoni: ధోనీతో కాంట్రవర్సీ.. తొలిసారి స్పందించిన సంజీవ్ గొయెంకా..


Updated Date - Dec 12 , 2024 | 08:01 PM