ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గురి కుదిరేనా!

ABN, Publish Date - Jul 21 , 2024 | 02:47 AM

పారిస్‌ ఒలింపిక్స్‌ షూటింగ్‌లో ఎన్నో ఆశలతో భారత్‌ బరిలో దిగుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా రైఫిల్‌, పిస్టల్‌, షాట్‌గన్‌ విభాగాల్లో కలిపి మొత్తం 21 కోటా స్థానాలను భారత్‌ దక్కించుకుంది. అన్ని స్థానాలు లభించడం మన షూటర్ల ప్రతిభకు నిదర్శనం...

షూటింగ్‌ బరిలో 21 మంది

పారిస్‌ ఒలింపిక్స్‌ షూటింగ్‌లో ఎన్నో ఆశలతో భారత్‌ బరిలో దిగుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా రైఫిల్‌, పిస్టల్‌, షాట్‌గన్‌ విభాగాల్లో కలిపి మొత్తం 21 కోటా స్థానాలను భారత్‌ దక్కించుకుంది. అన్ని స్థానాలు లభించడం మన షూటర్ల ప్రతిభకు నిదర్శనం. దాంతో సహజంగానే పారి్‌సలో పతకాలపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ ఒలింపిక్స్‌ షూటింగ్‌ విభాగంలో తలపడేందుకు మొత్తం 81 దేశాలు క్వాలిఫై అయ్యాయి. ఇందులో భారత్‌, చైనాల నుంచే అత్యధిక మంది షూటర్లు పోటీపడుతుండడం విశేషం.

టోక్యో విశ్వక్రీడల్లో అత్యధికంగా 15 మంది భారత షూటర్లు బరిలో దిగారు. ఒలింపిక్స్‌ షూటింగ్‌ కేటగిరీలో మన దేశానికి సంబంధించి అది రికార్డు. 2016 రియో క్రీడల్లో 12 మందే తలపడ్డారు. టోక్యోలో పురుషుల 10 మీ. ఎయిర్‌ పిస్టల్‌లో టీనేజ్‌ షూటర్‌ సౌరభ్‌ చౌధరి ఫైనల్‌కు చేరడమే ఆ క్రీడల్లో మన అత్యుత్తమ ప్రదర్శన. ఈసారి మనూభాకర్‌, ఇషా సింగ్‌, అంజుమ్‌ మౌద్గిల్‌, శరబ్‌ జోత్‌ సింగ్‌, రిథమ్‌ సంగ్వాన్‌, అనీశ్‌ భన్వాలా, విజయ్‌వీర్‌ సిద్ధూ, ఎలవేనిన్‌ వలరివన్‌,


పృథ్వీరాజ్‌ తదితరులు బరిలో ఉన్నారు. ఇక 21 మందిలో.. 15 మంది రైఫిల్‌, పిస్టల్‌ విభాగాల్లో, ఆరుగురు షాట్‌గన్‌లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

ఇప్పటికి నాలుగే..

ఒలింపిక్స్‌ షూటింగ్‌లో భారత్‌ ఇప్పటి వరకు నాలుగు పతకాలే (ఒక స్వర్ణం, రెండు రజత, ఒక కాంస్యం) గెలుపొందింది. 2004 ఏథెన్స్‌ క్రీడల్లో రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌ రజత పతకంతో విశ్వ క్రీడల షూటింగ్‌లో భారత్‌ ఖాతా తెరిచాడు. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో అభినవ్‌ భింద్రా స్వర్ణ పతకంతో చరిత్ర సృష్టిస్తే ఆ తర్వాత 2012లో గగన్‌ నారంగ్‌ (కాంస్యం), విజయ్‌ కుమార్‌ (రజత) పతకాలతో సత్తా చాటారు.

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

Updated Date - Jul 21 , 2024 | 02:47 AM

Advertising
Advertising
<