ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hardik Pandya: స్వంత మైదానంలో ముంబై కెప్టెన్‌ హార్దిక్‌కు అవమానం.. గేలి చేసిన అభిమానులు..!

ABN, Publish Date - Apr 02 , 2024 | 11:53 AM

ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా నియమితుడైన హార్దిక్ పాండ్యాపై ఆ జట్టు అభిమానులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. రోహిత్ స్థానంలో కెప్టెన్‌గా రావడం, వరుస పరాజయాలు హార్దిక్‌ను తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తున్నాయి.

ముంబై ఇండియన్స్ (MI) కెప్టెన్‌గా నియమితుడైన హార్దిక్ పాండ్యా (Hardik Pandya)పై ఆ జట్టు అభిమానులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. రోహిత్ (Rohit Sharma) స్థానంలో కెప్టెన్‌గా రావడం, వరుస పరాజయాలు హార్దిక్‌ను తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. హైదరాబాద్‌, అహ్మదాబాద్‌ మ్యాచ్‌ల సందర్భంగా హార్దిక్‌ పాండ్యాను అభిమానులు తీవ్ర స్థాయిలో గేలి చేశారు. ఈసారి స్వంత మైదానం వాంఖడే స్టేడియంలో కూడా హార్దిక్‌కు ఈ బెడద తప్పలేదు. సోమవారం వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ (MI vs RR) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది (IPL 2024).

ఈ మ్యాచ్‌లో టాస్ కోసం హార్దిక్ పాండ్యా మైదానంలోకి వచ్చాడు. ఆ సందర్భంగా పాండ్యాను అభిమానులు గేలి చేశారు. అలాగే ``ముంబైకా రాజ్.. రోహిత్.. రోహిత్`` అంటూ నినాదాలు చేశారు. అభిమానుల గోలతో కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ విసిగిపోయాడు. ``బిహేవ్`` అంటూ అభిమానుల వైపు చూశాడు. మ్యాచ్ సమయంలో కూడా అభిమానులు పాండ్యాకు వ్యతిరేకంగా కేకలు వేశారు. ఆ సమయంలో రోహిత్ వారి వైపు చూసి సైలెంట్‌గా ఉండాల్సిందిగా సూచించాడు.

ఈ మ్యాచ్‌లో ముంబై టీమ్‌ను రాజస్థాన్ రాయల్స్ జట్టు 6 వికెట్ల తేడాతో ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 9 వికెట్లకు 125 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేదనలో రాజస్థాన్‌ 15.3 ఓవర్లలో 4 వికెట్లకు 127 పరుగులు చేసి గెలిచింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి రాజస్థాన్ టాప్‌లోకి దూసుకెళ్లగా.. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడి ముంబై చిట్ట చివరన నిలిచింది.

ఇవి కూడా చదవండి..

MI vs RR: ముంబైని వణికించిన బౌల్ట్.. ఏకంగా ముగ్గురు బ్యాటర్లు గోల్డెన్ డకౌట్!


MI vs RR: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. ఆ ఘనత సాధించిన ఒకే ఒక జట్టుగా..

Updated Date - Apr 02 , 2024 | 12:35 PM

Advertising
Advertising