ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral News: బ్రిటిష్ నటితో హార్దిక్ పాండ్యా డేటింగ్.. నటషా రియాక్షన్ ఇందుకేనా?

ABN, Publish Date - Aug 17 , 2024 | 11:01 AM

టీమిండియా స్టా్ర్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా- నటాషా స్టాంకోవిచ్ ఇటివల అధికారికంగా విడిపోయారు. ఆ తర్వాత నటాషా మరో వ్యక్తితో కనిపించడంతో అనేక మంది ఆమెపై విమర్శలు గుప్పిస్తూ కామెంట్లు చేశారు. ఈ క్రమంలోనే తాజాగా హార్దిక్ పాండ్యా(Hardik Pandya) బ్రిటీష్ సింగర్, నటి జాస్మిన్ వాలియా(Jasmin Walia)తో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి.

Hardik Pandya Dating news

టీమిండియా స్టా్ర్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya)- నటాషా స్టాంకోవిచ్ ఇటివల అధికారికంగా విడిపోయారు. ఇద్దరూ కూడా విడాకుల గురించి సోషల్ మీడియాలో పోస్ట్‌లు షేర్ చేసుకున్నారు. ఆ తర్వాత నటాషా మరో వ్యక్తితో కనిపించడంతో అనేక మంది ఆమెపై విమర్శలు గుప్పిస్తూ కామెంట్లు చేశారు. ఈ క్రమంలోనే తాజాగా హార్దిక్ పాండ్యా(Hardik Pandya) బ్రిటీష్ సింగర్, నటి జాస్మిన్ వాలియా(Jasmin Walia)తో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాండ్యా, జాస్మిన్ వాలియాకు సంబంధించి చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


డేటింగ్ నిజమేనా

అయితే కొన్ని రోజుల క్రితం జాస్మిన్ గ్రీస్ నుంచి కొన్ని చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా కూడా గ్రీస్ నుంచి ఓ వీడియోను పంచుకున్నాడు. దీంతో వీరిద్దరూ కలిసి గ్రీస్‌లో తమ సెలవులను ఎంజాయ్ చేస్తున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో హార్దిక్, జాస్మిన్ వాలియాల డేటింగ్ గురించి పెద్ద ఎత్తున పుకార్లు వస్తున్నాయి. పాండ్యా పోస్ట్‌పై అభిమానులు కూడా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ డేటింగ్ అంశంపై హార్దిక్ కానీ, జాస్మిన్ కానీ అధికారికంగా ఇంకా స్పందించలేదు.


మళ్లీ నటాషా

ఇదిలా ఉంటే నటాషా సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. అందులో దేవుడిపై విశ్వాసం వ్యక్తం అంతా సవ్యంగా సాగుతుందని అన్నారు. సరైన సమయం వచ్చినప్పుడు దేవుడు అన్నీ సరిచేస్తాడని వీడియోలో తెలిపింది. మన వేగాన్ని తగ్గించుకోవాలి. అలా చేస్తే భగవంతుడు అన్నీ చక్కదిద్దే అవకాశం దొరుకుతుందని వెల్లడించింది. దీని తర్వాత మనం మరింత వేగంగా ముందుకు వెళ్లగలుగుతామని చెప్పింది నటాషా. నటాషా ఈ వీడియోకు హార్దిక్‌తో ఏదైనా సంబంధం ఉందా లేదా అనే దాని గురించి ఏమీ చెప్పలేము. నటషా ఎందుకు ఇలా చెప్పిందనే విషయం మాత్రం తెలియలేదు. వీరి డేటింగ్ పుకార్ల నేపథ్యంలోనే ఈ వీడియో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం వీరు మళ్లీ వార్తల్లోకి వచ్చారు.


పాండ్యా

అయితే హార్దిక్‌-నటాషాల అనుబంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. ఐపీఎల్ 2024 సమయంలో పాండ్యా చాలా కలత చెందాడు. ఆ తర్వాత ఎట్టకేలకు వీరిద్దరూ విడాకులు ప్రకటించారు. కానీ టీ20 ప్రపంచకప్ 2024 తర్వాత హార్దిక్ పాండ్యా తీవ్రంగా ఏడ్చాడు. టీమ్ ఇండియా టైటిల్ గెలుచుకుంది. భారత్ విజయం తర్వాత పాండ్యా తన బాధను వ్యక్తం చేశాడు. తాను చాలా కాలంగా ఇబ్బంది పడుతున్నానని ఒప్పుకున్నాడు. ఐపీఎల్ 2024లో హార్దిక్ చాలా ట్రోల్ అయ్యాడు. రోహిత్ శర్మ స్థానంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా నియమితుడై విఫలమయ్యాడని చెప్పవచ్చు.


ఇవి కూడా చదవండి:

PKL-11 : అజిత్‌, అర్జున్‌ జిగేల్‌


Saving Tips: SBI Fd Vs KVP.. రూ. 5 లక్షలు 10 ఏళ్ల పెట్టుబడికి ఏది బెస్ట్

Saving Scheme: రోజూ ఇలా రూ.200 సేవ్ చేయండి.. రూ.28 లక్షలు పొందండి..

Read More Sports News and Latest Telugu News

Updated Date - Aug 17 , 2024 | 11:03 AM

Advertising
Advertising
<