హాకీ అవార్డుల రేసులో హర్మన్, శ్రీజేష్
ABN, Publish Date - Sep 18 , 2024 | 05:13 AM
భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, మాజీ గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేష్ ఎఫ్‌ఐహెచ్ హాకీ అవార్డుల రేసులో నిలిచారు. మంగళవారం అంతర్జాతీయ హాకీ సమాఖ్య ఈ ఏడాది ఉత్తమ ప్లేయర్ల కుదించిన జాబితాను...
లాసాన్నె (స్విట్జర్లాండ్): భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, మాజీ గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేష్ ఎఫ్‌ఐహెచ్ హాకీ అవార్డుల రేసులో నిలిచారు. మంగళవారం అంతర్జాతీయ హాకీ సమాఖ్య ఈ ఏడాది ఉత్తమ ప్లేయర్ల కుదించిన జాబితాను విడుదల చేసింది. ఇందులో ఉత్తమ ప్లేయర్ అవార్డుల జాబితాలో హర్మన్‌ప్రీత్, ఉత్తమ గోల్‌కీపర్ జాబితాలో శ్రీజేష్ చోటు దక్కించుకున్నారు. ఈ ఇరువురు పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ కాంస్యం సాధించడంలో కీలకపాత్ర పోషించారు. ఒలింపిక్స్‌లో హర్మన్ 10 గోల్స్ చేయగా, శ్రీజేష్ గోల్‌పోస్టుకు అడ్డుగోడలా నిలిచి ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టాడు. వచ్చేనెల అక్టోబరు వరకు ఈ అవార్డు ఎంపిక కోసం ఆన్‌లైన్ ఓటింగ్‌ను కూడా నిర్వహిస్తున్నారు. ఈ అవార్డుల ప్రదానంలో ఎక్స్‌పర్ట్ ప్యానెల్ అభిప్రాయానికి 40 శాతం, జాతీయ హాకీ అసోసియేషన్లకు 20 శాతం, అభిమానుల ఓటింగ్ 20శాతం, మరో 20శాతం మీడియా అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకోనున్నారు.
Updated Date - Sep 18 , 2024 | 05:13 AM