ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gold Medal : గోల్డ్‌ మెడల్‌ ఖరీదు ఎంతంటే..

ABN, Publish Date - Aug 01 , 2024 | 12:40 AM

ఒలింపిక్స్‌లో గెలుపొందిన క్రీడాకారులకు ఇచ్చే పతకాలకు ఒక ప్రత్యేకత, విశిష్ఠత ఉంది. అనాది నుంచి వాటి తయారీలోనూ నిర్వాహకులు చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇక.. ఈ పారిస్‌ ఒలింపిక్స్‌లో

ఒలింపిక్స్‌లో గెలుపొందిన క్రీడాకారులకు ఇచ్చే పతకాలకు ఒక ప్రత్యేకత, విశిష్ఠత ఉంది. అనాది నుంచి వాటి తయారీలోనూ నిర్వాహకులు చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇక.. ఈ పారిస్‌ ఒలింపిక్స్‌లో ప్రదానం చేస్తున్న పసిడి పతకం తయారు చేసేందుకు భారత కరెన్సీలో సుమారు రూ.86 వేలు ఖర్చు అవుతుంది. 1912 స్టాక్‌హోమ్‌ ఒలింపిక్స్‌ వరకు పసిడి పతకాలంటే పూర్తిగా బంగారంతోనే చేసేవారు. అయితే, మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఒలింపిక్స్‌ నిర్వహణ వ్యయాలను తగ్గించే క్రమంలో స్వర్ణ పతకం తయారీలో మార్పులు చేశారు. పసిడి పతకాన్ని స్వచ్ఛమైన వెండితో చేసి, పైన బంగారు తాపడం చేయడం ఆరంభించారు. ప్రస్తుతం స్వర్ణ పతకం బరువు 529 గ్రాములుండగా, అందులో బంగారం ఆరు గ్రాములే. అంటే గోల్డ్‌ మెడల్‌లో గోల్డ్‌ ఉండేది 1.3 శాతమే. అయితే రజత పతకాన్ని మాత్రం పేరుకి తగ్గట్టే వెండితో చేస్తున్నారు. కాంస్య పతకాన్ని కాపర్‌, టిన్‌, జింక్‌ వంటి ఖనిజాల మిశ్రమంతో తయారు చేస్తున్నారు.

Updated Date - Aug 01 , 2024 | 12:40 AM

Advertising
Advertising
<