కెప్టెన్ సూర్యను దాటేసి.. తిలక్ @ 3
ABN, Publish Date - Nov 21 , 2024 | 06:02 AM
దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీ్‌సలో శతకాల మోత మోగించిన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ.. టీ20ల్లో టాప్-5లోకి దూసుకొచ్చాడు. బుధవారం తాజాగా విడుదల చేసిన ఐసీసీ టీ20
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్
దుబాయ్: దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీ్‌సలో శతకాల మోత మోగించిన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ.. టీ20ల్లో టాప్-5లోకి దూసుకొచ్చాడు. బుధవారం తాజాగా విడుదల చేసిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ బ్యాటర్ల జాబితాలో తిలక్ ఏకంగా 69 స్థానాలు ఎగబాకి కెరీర్‌లో అత్యుత్తమంగా 3వ ర్యాంక్‌ను సొంతం చేసుకొన్నాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఒక మెట్టు దిగి 4వ స్థానంలో నిలిచాడు. ట్రావిస్ హెడ్, ఫిల్ సాల్ట్ తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. కాగా, ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో హార్దిక్ పాండ్యా మళ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకొన్నాడు. రెండుస్థానాలు మెరుగుపర్చుకొన్న పాండ్యా నెం:1 ర్యాంక్‌ను దక్కించుకొన్నాడు. బౌలర్ల జాబితాలో అర్ష్‌దీప్ సింగ్ మూడు స్థానాలు ఎగబాకి తొమ్మిదో ర్యాంక్‌లో నిలవగా.. రవి బిష్ణోయ్ 8వ స్థానానికి పడిపోయాడు.
Updated Date - Nov 21 , 2024 | 06:02 AM