ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రోహిత్‌ ఫోన్‌ చేసుండకపోతే..

ABN, Publish Date - Jul 03 , 2024 | 02:57 AM

గతేడాది రోహిత్‌ శర్మ తనకు ఫోన్‌ చేసుండకపోతే, ఇవాళ ఈ చరిత్రాత్మక విజయంలో తాను భాగస్వామిని అయ్యేవాడిని కాదని రాహుల్‌ ద్రవిడ్‌ అన్నాడు. ‘నిరుడు నవంబరులో జట్టు వన్డే వరల్డ్‌కప్‌ ఓడడంతో...

బ్రిడ్జ్‌టౌన్‌ (బార్బడోస్‌): గతేడాది రోహిత్‌ శర్మ తనకు ఫోన్‌ చేసుండకపోతే, ఇవాళ ఈ చరిత్రాత్మక విజయంలో తాను భాగస్వామిని అయ్యేవాడిని కాదని రాహుల్‌ ద్రవిడ్‌ అన్నాడు. ‘నిరుడు నవంబరులో జట్టు వన్డే వరల్డ్‌కప్‌ ఓడడంతో చీఫ్‌ కోచ్‌గా తప్పుకోవాలని అనుకున్నా. కానీ, రోహిత్‌ నాకు ఫోన్‌ చేసి.. టీ20 ప్రపంచకప్‌ వరకైనా కొనసాగాలని కోరాడు. అయితే, మొదట కొంత తటపటాయించినా, రోహిత్‌ చెప్పిన మాటలకు కొనసాగేందుకు ఒప్పుకున్నా. ఆరోజు ఆ ఫోన్‌ రాకుంటే గనక ఈరోజు ఇంతటి అపురూపమైన క్షణాలు నాకు దక్కుండేవి కావు. అందుకే, రోహిత్‌కు ధన్యవాదాలు చెబుతున్నా’ అని ద్రవిడ్‌ చెప్పిన వీడియోను బీసీసీఐ పోస్ట్‌ చేసింది.


అందుకే మట్టి తిన్నా..: రోహిత్‌

టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌ గెలిచిన తర్వాత పిచ్‌పై ఉన్న మట్టిని తినడంపై రోహిత్‌ మాట్లాడుతూ.. ‘ఆ పిచ్‌ (బార్బడో్‌స)పై వరల్డ్‌కప్‌ ట్రోఫీ సాధించాం. జీవితాంతం ప్రత్యేకంగా గుర్తుండిపోయే ఆ పిచ్‌ను నాలో భాగం చేసుకోవాలనుకున్నా. అందుకే ఆ మట్టిని నోట్లో వేసుకున్నా’ అని చెప్పాడు.

Updated Date - Jul 03 , 2024 | 02:57 AM

Advertising
Advertising