ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బ్యాటింగ్‌ మెరుగైతేనే..!

ABN, Publish Date - Nov 13 , 2024 | 03:58 AM

నాలుగు టీ20ల సిరీస్‌ రసవత్తరంగా మారింది. తొలి మ్యాచ్‌లో భారత్‌.. ఆ తర్వాత ఆతిథ్య దక్షిణాఫ్రికా ఘనవిజయాలతో నువ్వా.. నేనా? అనే రీతిలో చెలరేగుతున్నాయి. ఈనేపథ్యంలో బుధవారం జరిగే కీలక మూడో టీ20లో....

నేడు మూడో టీ20

రాత్రి 8.30 నుంచి స్పోర్ట్స్‌18,

జియో సినిమాలో..

  • బౌలర్లపై అధిక భారం

  • విజయమే లక్ష్యంగా టీమిండియా

  • జోష్‌లో దక్షిణాఫ్రికా

సెంచూరియన్‌: నాలుగు టీ20ల సిరీస్‌ రసవత్తరంగా మారింది. తొలి మ్యాచ్‌లో భారత్‌.. ఆ తర్వాత ఆతిథ్య దక్షిణాఫ్రికా ఘనవిజయాలతో నువ్వా.. నేనా? అనే రీతిలో చెలరేగుతున్నాయి. ఈనేపథ్యంలో బుధవారం జరిగే కీలక మూడో టీ20లో ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగబోతున్నాయి. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో నెగ్గిన జట్టు సిరీస్‌ కోల్పోయే అవకాశం ఉండదు. అయితే రెండు మ్యాచ్‌ల్లో భారత్‌ తరఫున బౌలర్లు మాత్రమే అంతో ఇంతో రాణించగలిగారు. కానీ అనూహ్యంగా బ్యాటింగ్‌ ఆర్డర్‌ నుంచి మాత్రం ఎలాంటి సహకారమూ అందలేదు. సంజూ శాంసన్‌ మెరుపు సెంచరీ కారణంగానే తొలి మ్యాచ్‌లో నెగ్గగలిగాం. కానీ రెండో టీ20లో బ్యాటర్లు ప్రత్యర్థి పేసర్లకు దాసోహమయ్యారు. చివర్లో హార్దిక్‌ షాట్ల కారణంగా స్కోరు 120 దాటగలిగింది. భారత్‌ ఇక్కడ ఆడిన ఒకే టీ20 మ్యాచ్‌ (2018లో)లో ఆరు వికెట్ల తేడాతో ఓడింది. హార్దిక్‌ మాత్రమే అప్పటి జట్టులో ఉన్నాడు. అటు సఫారీలు మాత్రం రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు. వారి బ్యాటింగ్‌ కూడా ఫామ్‌లో లేకపోయినా ఆఖర్లో ఒత్తిడిని తట్టుకుని స్టబ్స్‌, కొట్జీ జట్టును గెలిపించారు. బౌలర్లు సూపర్‌ ఫామ్‌లో ఉండడంతో మరో విజయంతో ఆధిపత్యం చూపాలనుకుంటోంది.


మార్పులుంటాయా?

ఓపెనర్‌గా అభిషేక్‌ శర్మ వైఫల్యం జట్టు శుభారంభంపై ప్రభావం పడుతోంది. వరుసగా విఫలమవుతున్న అతడిని కొనసాగించడం సందేహమే. అతడిని పక్కనబెడితే శాంసన్‌కు జతగా తిలక్‌ వర్మను పంపి.. ఆల్‌రౌండర్‌ రమణ్‌దీప్‌ సింగ్‌ను బరిలోకి దించే అవకాశం ఉంది. అతడి రాకతో మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌ బలపడుతుంది. అలాగే కెప్టెన్‌ సూర్య, రింకూ సింగ్‌ ఈ సిరీ్‌సలో పెద్దగా ప్రభావం చూపలేదు. హార్దిక్‌ రెండో మ్యాచ్‌లో 39 రన్స్‌ చేసినా 45 బంతులు తీసుకున్నాడు. తొలి బౌండరీ కోసమే 28 బంతులు ఆడాల్సి వచ్చింది. కాబట్టి శాంసన్‌కు తోడుగా ఈ ముగ్గురు చెలరేగితేనే భారత్‌ భారీ స్కోరు చేయగలుగుతుంది. పేసర్‌ అర్ష్‌దీప్‌ డర్బన్‌ మ్యాచ్‌లో ఆకట్టుకున్నా.. రెండో టీ20లో దెబ్బతీశాడు. అతడి చివరి రెండు ఓవర్లలో 28 పరుగులివ్వడం స్వల్ప స్కోరు ఛేదనలో తీవ్ర ప్రభావం చూపింది. ఒకవేళ వైశాక్‌, యష్‌లలో ఒకరిని పరీక్షిస్తారేమో చూడాలి. స్పిన్నర్లు వరుణ్‌, బిష్ణోయ్‌లను ఎదుర్కోవడంలో సఫారీ బ్యాటర్లు తెగ ఇబ్బందిపడుతున్నారు. నేటి మ్యాచ్‌లోనూ వీరే కీలకం కానున్నారు.


తుది జట్లు (అంచనా)

భారత్‌: సూర్య కుమార్‌ (కెప్టెన్‌), శాంసన్‌, తిలక్‌ వర్మ, హార్దిక్‌, అక్షర్‌, రింకూ, రమణ్‌దీప్‌, అర్ష్‌దీప్‌, బిష్ణోయ్‌, అవేశ్‌, వరుణ్‌ చక్రవర్తి.

దక్షిణాఫ్రికా: హెన్‌డ్రిక్స్‌, రికెల్టన్‌, మార్‌క్రమ్‌ (కెప్టెన్‌), స్టబ్స్‌, క్లాసెన్‌, మిల్లర్‌, జాన్సెన్‌, కేశవ్‌, కొట్జీ, సిమలానె, సిపామ్ల.

ఒత్తిడిలో వెటరన్‌ త్రయం

దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ ఆర్డర్‌ తమ సొంత గడ్డపై కూడా ఎలాంటి ప్రభావమూ చూపడం లేదు. కెప్టెన్‌ మార్‌క్రమ్‌తో పాటు క్లాసెన్‌, మిల్లర్‌పై జట్టు భారీగా ఆశలు పెట్టుకుంది. కానీ రెండు మ్యాచ్‌ల్లోనూ ఈ త్రయం దారుణంగా విఫలమైంది. సన్‌రైజర్స్‌ రూ.23 కోట్లతో అట్టిపెట్టుకున్న క్లాసెన్‌ కొంతకాలంగా ఫామ్‌లేమితో ఇబ్బందిపడుతున్నాడు. మూడో టీ20లో భారత్‌పై సులువుగా గెలవాలంటే వీరిలో ఇద్దరైనా రాణించాల్సి ఉంటుంది. స్టబ్స్‌, కొట్జీ పుణ్యమాని రెండో మ్యాచ్‌లో గెలవగలిగారు. బౌలింగ్‌లో పేసర్లు, స్పిన్నర్లు పరుగులను కట్టడి చేస్తూనే వికెట్లను రాబడుతుండడం సానుకూలాంశం కానుంది.

పిచ్‌, వాతావరణం

సెంచూరియన్‌ పార్క్‌ పేసర్లకు స్వర్గధామం. ఇక్కడి బౌన్స్‌, పేస్‌ వికెట్‌ వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే బ్యాటర్లు పరుగులు సాధించడం కష్టమే. అదనపు బౌన్స్‌తో స్పిన్నర్లు కూడా లాభపడతారు. టాస్‌ గెలిచిన జట్టు బౌలింగ్‌ ఎంచుకునే అవకాశం ఉంటుంది.

Updated Date - Nov 13 , 2024 | 03:58 AM