ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

భగవద్గీత చూపిన దారిలో..

ABN, Publish Date - Jul 29 , 2024 | 03:50 AM

హరియాణా పేరు చెప్పగానే ప్రఖ్యాత రెజ్లర్లు, స్టార్‌ బాక్సర్ల పేర్లు గుర్తుకొస్తాయి. అయితే ఆ రాష్ట్రం నుంచి షూటింగ్‌ పతకంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది మనుభాకర్‌. కెరీర్‌ ప్రారంభంలో టెన్నిస్‌, స్కేటింగ్‌, బాక్సింగ్‌, వాలీబాల్‌ జాతీయ పోటీల్లో...

హరియాణా పేరు చెప్పగానే ప్రఖ్యాత రెజ్లర్లు, స్టార్‌ బాక్సర్ల పేర్లు గుర్తుకొస్తాయి. అయితే ఆ రాష్ట్రం నుంచి షూటింగ్‌ పతకంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది మనుభాకర్‌. కెరీర్‌ ప్రారంభంలో టెన్నిస్‌, స్కేటింగ్‌, బాక్సింగ్‌, వాలీబాల్‌ జాతీయ పోటీల్లో మను దాదాపు 60 పతకాలు సొంతం చేసుకుంది. కానీ షూటింగ్‌ నేర్చుకోవాలన్న ఆమె ఇష్టాన్ని కాదనలేక తల్లిదండ్రులు రూ.1.80 లక్షలు పెట్టి తొలి పిస్టల్‌ను కొన్నారు. అలా 12 ఏళ్ల వయసులో షూటర్‌గా ప్రస్థానం ప్రారంభించిన మను 19 ఏళ్లు వచ్చేసరికి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. అయితే, ఆ ఒలింపిక్స్‌లో పిస్టల్‌ సరిగ్గా పనిచేయక రిక్త హస్తాలతో భారత్‌కు తిరిగొచ్చిన మను నిరీక్షణ ఎట్టకేలకు పారిస్‌ విశ్వక్రీడల్లో కాంస్యం పతకంతో ఫలించింది.


ఆరంభం నుంచీ సంచలనమే..

14 ఏళ్ల వయసులోనే ఒలింపియన్‌, మాజీ వరల్డ్‌ నెంబర్‌ వన్‌ హీనా సిద్ధూకు మనుభాకర్‌ షాకిచ్చింది. సాధన ఆరంభించిన ఏడాదికే 2017 జాతీయ షూటింగ్‌ చాంపియన్‌షిప్స్‌ 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఫైనల్లో హీనాను ఓడించడంతో పాటు ఆమె రికార్డును చెరిపేసింది. అదే ఏడాది ఆసియా జూనియర్‌ చాంపియన్‌షి్‌పలో రజతంతో మెరిసి సత్తా చాటింది. ఆతర్వాత జరిగిన ఐఎ్‌సఎ్‌సఎఫ్‌ జూనియర్‌ షూటింగ్‌ వరల్డ్‌కప్‌ 10 మీ., ఎయిర్‌ పిస్టల్‌ అర్హత పోటీల్లో ప్రపంచ రికార్డును బద్దలుకొట్టింది. ఈ వరల్డ్‌కప్‌ ఫైనల్లో మూడుసార్లు ఐఎ్‌సఎ్‌సఎఫ్‌ విజేత, సిలైన్‌ గోబెర్‌విల్లెను ఓడించి పసిడి పతకం సాధించి చరిత్ర సృష్టించింది.

తెలిపింది. ఫైనల్‌కు ముందు కూడా భగవద్గీత చదివానని చెప్పింది.


2018లో మోత మోగించింది

మను కెరీర్‌లో 2018 చాలా ప్రత్యేకమైంది. గోల్డ్‌కోస్ట్‌ కామన్వెల్త్‌ క్రీడల్లో 10 మీ., ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో స్వర్ణం కొల్లగొట్టి సంచలనం సృష్టించింది. అదే ఏడాది జూనియర్‌ వరల్డ్‌క్‌పలో 10 మీ., ఎయిర్‌ పిస్టల్‌ కేటగిరీలో పసిడి, మిక్స్‌డ్‌లో కాంస్యం సాధించి సత్తా చాటింది. అర్జెంటీనాలో జరిగిన యూత్‌ ఒలింపిక్స్‌ 10 మీ., ఎయిర్‌ పిస్టల్‌లో స్వర్ణం సాధించి ఈ క్రీడల్లో పతకం నెగ్గిన తొలి షూటర్‌గా చరిత్రకెక్కింది.


గీతాసారంతో ముందుకు..

పోటీ ఏదైనా పతకం ఖాయమనే రీతిలో దూసుకెళ్తున్న మనుకు టోక్యో ఒలింపిక్స్‌లో చుక్కెదురైంది. ఒలింపిక్స్‌ ముందు వరకు మంచి ఫామ్‌లో ఉన్న మను, విశ్వక్రీడల్లో పిస్టల్‌ సరిగ్గా పనిచేయక ఒత్తిడికిలోనై పతక రేసులో విఫలమైంది. ఈ క్రమంలో నైరాశ్యంతో ఇంటికొచ్చిన మనుకు ఆమె తల్లిదండ్రులు భగవద్గీతను ఇచ్చారు. స్వతహాగా షూటింగ్‌ రేంజ్‌లో చిన్నపాటి విరామం లభించినా పుస్తకాలు చదివే అలవాటున్న మను ఆ తర్వాత నుంచి గీత చదవడం ప్రారంభించింది. అందులో శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశించిన ఓ అంశం ఆమెను బాగా ఆకర్షించింది. ‘భగవద్గీతను చాలా చదివాను. చేసే పనిమీదే దృష్టి పెట్టు. కర్మ ఫలితం మీద కాదు. ఫలితం ఎలావున్నా స్వీకరించు’ అన్న మాటలు తనను ఎంతగానో ప్రభావితం చేశాయని

Updated Date - Jul 29 , 2024 | 03:50 AM

Advertising
Advertising
<