India vs England 3rd Test: బ్యాటింగ్‌లో తడబాటు.. స్వల్ప స్కోరుకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా
ABN, Publish Date - Feb 15 , 2024 | 12:17 PM
భారత్, ఇంగ్లండ్ మధ్య రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు తొలి సెషన్ ముగిసింది. లంచ్ విరామ సమయానికి భారత్ 3 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది. కాగా ఇన్నింగ్స్ ఆరంభంలో టీమిండియా 33 పరుగుల స్వల్ప స్కోరుకే కీలకమైన 3 వికెట్లు చేజార్చుకుంది. వైజాగ్ టెస్టులో డబుల్ సెంచరీతో అదరగొట్టిన యశస్వి జైస్వాల్ ఈ రోజు కేవలం 10 పరుగులకే ఔట్ అయ్యాడు.
రాజ్‌కోట్: భారత్, ఇంగ్లండ్ మధ్య రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు తొలి సెషన్ ముగిసింది. లంచ్ విరామ సమయానికి భారత్ 3 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది. కాగా ఇన్నింగ్స్ ఆరంభంలో టీమిండియా 33 పరుగుల స్వల్ప స్కోరుకే కీలకమైన 3 వికెట్లు చేజార్చుకుంది. వైజాగ్ టెస్టులో డబుల్ సెంచరీతో అదరగొట్టిన యశస్వి జైస్వాల్ ఈ రోజు కేవలం 10 పరుగులకే ఔట్ అయ్యాడు. మార్క్ ఉడ్ బౌలింగ్‌లో రూట్‌కి క్యాచ్ ఇచ్చిన వెనుదిరిగాడు. ఇక వైజాగ్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో అదరగొట్టిన శుభ్‌మాన్ గిల్ ఈ మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. రజత్ పటీదార్ రూపంలో టీమిండియా స్వల్ప స్కోరుకే టీమిండియా మరో వికెట్ కోల్పోయింది. వ్యక్తిగత స్కోరు 5 పరుగుల వద్ద టామ్ హార్ట్లీ బౌలింగ్‌లో డకెట్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. కాగా ప్రస్తుతం క్రీజులో రోహిత్ వర్మ(52), రవీంద్ర జడేజా (24) బ్యాటింగ్ చేస్తున్నారు.
ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ ఉడ్ 2 వికెట్లు, టామ్ హార్ట్లీ 1 వికెట్ తీశారు. కాగా భారత్ జట్టు స్కోరు 22 పరుగుల వద్ద తొలి వికెట్, 24 పరుగుల వద్ద 2వ సెకండ్ వికెట్, 33 పరుగుల వద్ద మూడవ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా ఆచితూచి ఆడుతూ చక్కదిద్దారు.
Updated Date - Feb 15 , 2024 | 12:17 PM