ఒత్తిడిలో భారత్
ABN, Publish Date - Oct 24 , 2024 | 02:09 AM
మొదటి టెస్ట్‌లో అనూహ్య పరాజయంలో ఉలిక్కిపడిన భారత్.. కసిగా బదులు తీర్చుకోవాలనుకొంటోంది. గురువారం నుంచి న్యూజిలాండ్‌తో జరిగే కీలక రెండో టెస్ట్‌లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. మూడు టెస్ట్‌ల సిరీ్‌సలో...
చరిత్ర కోసం కివీస్
ఉదయం 9.30 నుంచి జియో సినిమాలో ..
రెండో టెస్ట్ నేటి నుంచే
గిల్‌కు చోటు.. ఫిట్‌గా పంత్
పుణె: మొదటి టెస్ట్‌లో అనూహ్య పరాజయంలో ఉలిక్కిపడిన భారత్.. కసిగా బదులు తీర్చుకోవాలనుకొంటోంది. గురువారం నుంచి న్యూజిలాండ్‌తో జరిగే కీలక రెండో టెస్ట్‌లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. మూడు టెస్ట్‌ల సిరీ్‌సలో భాగంగా తొలి మ్యాచ్‌లో ఓడిన టీమిండియా 0-1తో వెనుకబడింది. సిరీ్‌సను సొంతం చేసుకోవాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో గెలవడం తప్పనిసరి కావడంతో రోహిత్ సేనపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. అయితే, ఇంగ్లండ్‌తో సిరీ్‌సలో కూడా టీమిండియా ఇలాగే తొలి టెస్టులో ఓడినా.. ఆ తర్వాత చెలరేగి సిరీస్‌ను సొంతం చేసుకొంది. బెంగళూరు మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలడంతో కోలుకోలేక పోయిన భారత్.. చివరకు 8 వికెట్లతో పరాజయం పాలైంది. కానీ, వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షి్‌ప (డబ్ల్యూటీసీ) టేబుల్‌లో టీమిండియా ఇంకా టాప్‌లోనే కొనసాగుతోంది.
రాబోయేది ఆస్ట్రేలియా టూర్ కావడంతో.. స్వదేశంలో మిగిలిన రెండు టెస్టుల్లో విజయాలు సాధించి గెలుపు శాతాన్ని పెంచుకొంటేనే డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు బలపడతాయి. ఈ నేపథ్యంలో సొంతగడ్డపై ఉన్న అనుకూలతను భారత్ సొమ్ము చేసుకోవాలనుకొంటోంది. ఇందులో భాగంగా పుణెలో స్పిన్‌కు సహకరించే మందకొడి వికెట్‌తో లాభం పొందాలని చూస్తోంది. కానీ, గతంలో టర్నింగ్ వికెట్ వ్యూహం బెడిసికొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎనిమిదేళ్ల క్రితం పుణెలో జరిగిన టెస్ట్‌లో ఆసీస్ 8 వికెట్ల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. ఆ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని జట్టు కూర్పుపై మేనేజ్‌మెంట్ దృష్టిసారించింది.
సర్ఫరాజ్ లేదా రాహుల్: మెడ నొప్పితో తొలి మ్యాచ్‌కు దూరమైన శుభ్‌మన్ గిల్‌కు తుది జట్టులో చోటు ఖాయం కావడంతో.. కేఎల్ రాహుల్, సర్ఫరాజ్‌లో ఒకరు బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశం ఉంది. బెంగళూరు టెస్ట్‌లో రెండో ఇన్నింగ్స్‌లో 150 పరుగులతో సర్ఫరాజ్ గట్టిపోటీ ఇస్తుండగా.. రాహుల్ వరుస వైఫల్యాలతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. కానీ, కోచ్ గంభీర్ మాత్రం రాహుల్‌కు మద్దతుగా నిలుస్తుండడం విశేషం. ఇక, రోహిత్‌కు శుభారంభాలు దక్కినా.. భారీస్కోర్లుగా మలచలేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. 2019-20లో దక్షిణాఫ్రికాపై కోహ్లీ (254 నాటౌట్) ఇదే వికెట్‌పై డబుల్ సెంచరీ చేశాడు. దీంతో అతడు మరోసారి తన బ్యాటింగ్ మ్యాజిక్‌ను ప్రదర్శించాలని ఫ్యాన్స్ బలంగా కోరుకొంటున్నారు. వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఫిట్‌గా ఉన్నట్టు గంభీర్ చెప్పడంతో తుది జట్టులో అతడికి చోటుదక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సిరాజ్ ఆకట్టుకోలేక పోతుండడంతో అతడి స్థానంలో ఆకాశ్‌దీ్‌పకు చోటు కల్పిస్తారని తెలుస్తోంది.
అశ్విన్‌తోపాటు జడేజా, కుల్దీ్‌పతో స్పిన్ విభాగం బలంగా ఉంది. ఒకవేళ ఆల్‌రౌండర్ సుందర్‌ను తీసుకోవాలనుకొంటే అశ్విన్‌ను పక్కన బెట్టే అవకాశం లేకపోలేదు. మరోవైపు ఊహించని రీతిలో బోణీ కొట్టిన న్యూజిలాండ్.. ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంది. ఈ మ్యాచ్‌తోపాటు సిరీ్‌సను సొంతం చేసుకొని చరిత్ర సృష్టించాలనుకొంటోంది. స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ లేకపోయినా.. కాన్వే, లాథమ్, యంగ్‌తోపాటు రచిన్ రవీంద్ర అద్భుత బ్యాటింగ్‌తో చిరస్మరణీయ విజయాన్ని అందించారు. స్పిన్ పిచ్ కావడంతో బౌలింగ్ విభాగంలో మార్పులు చేసే చాన్సులున్నాయి. సౌథీని పక్కనబెట్టి శాంట్నర్‌ను జట్టులోకి తీసుకోవచ్చు.
జట్లు (అంచనా)
భారత్: జైస్వాల్, రోహిత్, గిల్, కోహ్లీ, రిషభ్ పంత్, రాహుల్/సర్ఫరాజ్, జడేజా, అశ్విన్, కుల్దీప్, బుమ్రా, సిరాజ్/ఆకాశ్‌దీ్‌ప,
న్యూజిలాండ్: టామ్ లాథమ్ (కెప్టెన్), కాన్వే, యంగ్, రచిన్ రవీంద్ర, మిచెల్, బ్లండెల్ (వికెట్ కీపర్), ఫిలిప్స్, శాంట్నర్, సౌథీ/ఓరోక్, హెన్రీ, ఎజాజ్ పటేల్.
టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్‌గా రికార్డుకు రోహిత్ రెండు సిక్సర్ల దూరంలో ఉన్నాడు.
పిచ్/వాతావరణం
పుణె పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. నల్లమట్టి వికెట్ కావడంతో పేసర్లకు పెద్దగా సహకరించే చాన్సులు లేవు. మ్యాచ్ సాగేకొద్దీ స్పిన్నర్లకు మరింత అనుకూలంగా మారవచ్చు. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకొనే అవకాశం ఉంది. వాతావరణం సాధారణంగా ఉండనుంది.
Updated Date - Oct 24 , 2024 | 02:09 AM