ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

36 ఏళ్ల తర్వాత..

ABN, Publish Date - Oct 21 , 2024 | 12:38 AM

ఆశలు అడియాశలయ్యాయి.. భారత బౌలర్ల నుంచి అద్భుతాలేమీ జరుగలేదు. వరుస వి జయాలతో దూసుకెళుతున్న టీమిండియాకు గట్టి ఝలక్‌ తగిలింది. ఆఖరి రోజు ఆదివారం 107 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని న్యూజిలాండ్‌

భారత గడ్డపై టెస్టు నెగ్గిన కివీస్‌

8 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి

బెంగళూరు: ఆశలు అడియాశలయ్యాయి.. భారత బౌలర్ల నుంచి అద్భుతాలేమీ జరుగలేదు. వరుస వి జయాలతో దూసుకెళుతున్న టీమిండియాకు గట్టి ఝలక్‌ తగిలింది. ఆఖరి రోజు ఆదివారం 107 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని న్యూజిలాండ్‌ పెద్దగా కష్టపడకుండానే ఛేదించింది. దీంతో 8 వికెట్ల తేడాతో నెగ్గిన లాథమ్‌ సేన.. భారత గడ్డపై చిరస్మరణీయ విజయాన్నందుకుంది. ఎందుకంటే.. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 36 ఏళ్ల తర్వాత వారికి దక్కిన టెస్టు గెలుపిది. అప్పు డెప్పుడో 1988లో చివరిసారిగా వాంఖడే మైదానంలో కివీస్‌ నెగ్గింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే. కివీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో 27.4 ఓవర్లలో 2 వికెట్లకు 110 పరుగులు చేసి గెలిచింది. విల్‌ యంగ్‌ (48 నాటౌట్‌), ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ రచిన్‌ రవీంద్ర (39 నాటౌట్‌) అజేయంగా నిలిచారు. బుమ్రాకు రెండు వికెట్లు దక్కా యి. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 46, రెండో ఇన్నింగ్స్‌లో 462 పరుగులు చేయగా, కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 402 పరుగులు చేసింది. రెండో టెస్టు పుణెలో 24 నుంచి జరుగనుంది.

‘రెండో’ బంతికే వికెట్‌ పడినా..: శనివారం సాయంత్రం నుంచి కురిసిన వర్షం ఆదివారం ఉదయం వరకు కొనసాగింది. సరిగ్గా మ్యాచ్‌ సమయానికి ఆగినా.. మైదానాన్ని సిద్ధం చేసేందుకు సమయం పట్టింది. దీంతో గంట ఆలస్యంగా ఆట ఆరంభమైంది. అయితే పిచ్‌ను రాత్రంతా కప్పి ఉంచడంతో పాటు పగుళ్లు కూడా కనిపిస్తుండడం, ఆకాశం మేఘావృతంగా ఉండడంతో భారత బౌలర్లు కివీ్‌సను ఇబ్బందిపెట్టగలరనిపించింది. దీనికి తగ్గట్టుగానే పేసర్లు చక్కటి బౌన్స్‌ రాబట్టారు. నాలుగోరోజు ఆట చివర్లో తొలి ఓవర్‌ను నాలుగు బంతులకే ముగించిన విషయం తెలిసిందే. ఇక, ఐదోరోజు ఆటలో బుమ్రా ఆ ఓవర్‌ను కొనసాగిస్తూ రెండో బంతి (ఆరోది)కే ఓపెనర్‌ లాథమ్‌ (0)ను ఎల్బీ చేశాడు. లాథమ్‌ డీఆర్‌ఎ్‌సకు వెళ్లినా ఫలితం లేకపోయింది. అటు సిరాజ్‌ పకడ్బందీగా బంతులేస్తూ తన తొలి ఓవర్‌ను మెయిడిన్‌గా ముగించాడు. ముఖ్యంగా బుమ్రా బంతులు కివీస్‌ బ్యాటర్లను తాకుతూ భయపెట్టాయి. కివీస్‌ తొలి పది ఓవర్లలో 21 రన్స్‌ చేసింది. 13వ ఓవర్‌లో కాన్వేను బుమ్రా ఎల్బీ చేసినా అంపైర్‌ నాటౌట్‌ ఇవ్వడంతో భారత్‌ రివ్యూకు వెళ్లి ఫలితం సాధించింది. దీంతో 35/2 స్కోరుతో కివీస్‌ కాస్త ఇబ్బందుల్లో పడినట్టు కనిపించినా.. రచిన్‌ రాగానే రెండు ఫోర్లతో పరిస్థితిని మార్చేశాడు. దీనికితోడు చక్కగా వెలుతురు కూడా రావడం కివీ్‌సకు కలిసొచ్చింది. అటు యంగ్‌ కూడా 14వ ఓవర్‌లో వరుస ఫోర్లతో ఎదురుదాడికి దిగాడు. కుల్దీప్‌ ఓవర్లలో యంగ్‌ సిక్సర్‌, రచిన్‌ 3 ఫోర్లు కొట్టడంతో పరుగులు వేగంగా వచ్చాయి. దీంతో ఇక భారత్‌కు ఎలాంటి ఆశలు లేకపోయాయి. 28వ ఓవర్‌లో సింగిల్‌తో యంగ్‌ తమ జట్టుకు అద్భుత విజయాన్నందించాడు.


ఓ ఇన్నింగ్స్‌లో ఎక్కువ పరుగులు (462) చేసినా ఓడడం భారత్‌కిదే తొలిసారి

మొదటి రోజు ఆట వర్షార్పణమైనా ఫలితం రావడం భారత గడ్డపై ఇది మూడోసారి. గతంలో కివీస్‌ (1976లో), ఆసీస్‌ (2013)లపై భారత్‌ గెలిచింది.

భారత పర్యటనలో కివీస్‌ ఆడిన 37 టెస్టుల్లో కేవలం ఇది మూడో విజయం. 1969, 1988లో ఒక్కో టెస్టు నెగ్గింది.

ఆ 3 గంటల ఆటతో అంచనాకు రావద్దు

ఈ మ్యాచ్‌ ఫలితం గురించి సీరియస్‌గా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తొలి ఇన్నింగ్స్‌లో ఆ 3 గంటల ఆటతోనే భారత జట్టు స్థాయిని అంచనా వేయలేరు. రెండో ఇన్నింగ్స్‌లో మేం పుంజుకున్న తీరు కూడా గమనించాలి. కొన్ని పొరపాట్లు చేసి ఫలితం అనుభవించాం. కానీ ఆ మాత్రానికే అంతా అయిపోయిందని భావించవద్దు. గతంలోనూ ఇలాగే జరిగి అద్భుతంగా పుంజుకున్నాం. పంత్‌ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి కీపింగ్‌కు దించలేదు. - రోహిత్‌ శర్మ

ఓడినా టాప్‌లోనే..

న్యూజిలాండ్‌తో తొలి టెస్టును ఓడినా వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షి్‌ప పట్టికలో భారత జట్టు (98 పాయింట్లు) టాప్‌లోనే ఉంది. విజయాల శాతం మాత్రం 74.24 నుంచి 68.06కి పడిపోయింది. ఆస్ట్రేలియా (62.50), శ్రీలంక (55.56) టాప్‌-3లో ఉన్నాయి. ఈ గెలుపుతో కివీస్‌ ఆరో స్థానం నుంచి నాలుగో స్థానానికి ఎగబాకింది. మరోవైపు భారత్‌ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే రాబోయే టెస్టులు కీలకంగా మారాయి. ఆడాల్సిన ఏడు టెస్టుల్లో కనీసం ఐదింటిని గెలిస్తే నేరుగా ఫైనల్‌కు వెళుతుంది.

స్కోరుబోర్డు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 46

కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌: 402

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: 462

కివీస్‌ రెండో ఇన్నింగ్స్‌: టామ్‌ లాథమ్‌ (ఎల్బీ) బుమ్రా 0; కాన్వే (ఎల్బీ) బుమ్రా 17; యంగ్‌ (నాటౌట్‌) 48; రచిన్‌ (నాటౌట్‌) 39; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 27.4 ఓవర్లలో 110/2. వికెట్ల పతనం: 1-0, 2-35. బౌలింగ్‌: బుమ్రా 8-1-29-2; సిరాజ్‌ 7-3-16-0; జడేజా 7.4-1-28-0; కుల్దీప్‌ 3-0-26-0; అశ్విన్‌ 2-0-6-0.


Updated Date - Oct 21 , 2024 | 12:38 AM