ఒకే గ్రూపులో భారత్-పాక్
ABN, Publish Date - May 06 , 2024 | 05:26 AM
బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇవ్వనున్న మహిళల టీ20 వరల్డ్‌కప్ షెడ్యూల్‌ను ఐసీసీ ఆదివారం విడుదల చేసింది. డిఫెండింగ్ చాంప్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్ లాంటి జట్లున్న...
అక్టోబరు 4న కివీ్‌సతో తొలి పోరు
మహిళల టీ20 వరల్డ్‌కప్ షెడ్యూల్
దుబాయ్: బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇవ్వనున్న మహిళల టీ20 వరల్డ్‌కప్ షెడ్యూల్‌ను ఐసీసీ ఆదివారం విడుదల చేసింది. డిఫెండింగ్ చాంప్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్ లాంటి జట్లున్న గ్రూప్-ఎలోనే భారత్ కూడా ఉంది. ఈ ఏడాది అక్టోబరు 3 నుంచి 20 వరకు టోర్నీ జరగనుంది. 4న జరిగే తమ తొలి మ్యాచ్‌లో కివీ్‌సతో, 6న పాకిస్థాన్‌తో, 9న క్వాలిఫయర్-1తో, 13న ఆసీ్‌సతో భారత్ ఆడనుంది. గ్రూప్-బిలో ఆతిథ్య బంగ్లాతోపాటు సౌతాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్, క్వాలిఫయర్-2 జట్లు ఉండనున్నాయి. అక్టోబరు 17, 18 తేదీల్లో సెమీస్ మ్యాచ్‌లు, 20న ఢాకాలో ఫైనల్ జరుగుతాయి. ఢాకాలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని షేక్ హసీనా, భారత్, బంగ్లా దేశాల కెప్టెన్లు హర్మన్‌ప్రీత్, నిగర్ సుల్తాన్ పాల్గొన్నారు.
Updated Date - May 06 , 2024 | 05:26 AM