భారత్ రికార్డు స్కోరు
ABN, Publish Date - Jun 30 , 2024 | 01:54 AM
బ్యాటర్ల ఆధిపత్యంతో.. మహిళల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే భారత్ అత్యధిక స్కోరు నమోదు చేసింది.
603/6 డిక్లేర్ ఫ మహిళల టెస్ట్ క్రికెట్‌లోనే అత్యధిక స్కోరు
దక్షిణాఫ్రికా 236/4 ఫ స్నేహ్ రాణాకు 3 వికెట్లు
చెన్నై: బ్యాటర్ల ఆధిపత్యంతో.. మహిళల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే భారత్ అత్యధిక స్కోరు నమోదు చేసింది. క్రితం రోజు స్కోరు 525/4తో శనివారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్ 603/6 వద్ద డిక్లేర్ చేసింది. మొదటి రోజు స్కోరుకు 78 రన్స్ జోడించింది. ఓవర్‌నైట్ బ్యాటర్లు హర్మన్‌ప్రీత్ (69), రిచా ఘోష్ (86) ఐదో వికెట్‌కు 143 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. సుదీర్ఘ ఫార్మాట్‌లో తొలి అర్ధ శతకం సాధించిన హర్మన్‌ను టుమి అవుట్ చేసింది. ధాటిగా ఆడుతూ టీమ్ స్కోరును 600 మార్క్ దాటించిన ఘోష్‌ను మ్లాబా ఎల్బీ చేయడంతో.. భారత్ డిక్లేర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా రెండోరోజు ఆట ముగిసేసరికి 236/4 స్కోరు చేసింది. స్నేహ్ రాణా (3/61) మూడు వికెట్లు తీసింది. మరిజానె కాప్ (69), నడిన్ డి క్లార్క్ (27) క్రీజులో ఉన్నారు. సునె లుస్ (65) అర్ధ సెంచరీ చేయగా, ఓపెనర్లు వొల్వార్ట్ 20, బాష్ 39 రన్స్ చేశారు. కానీ, భారత తొలి ఇన్నింగ్స్ స్కోరుకు సౌతాఫ్రికా 367 పరుగులు వెనుకంజలో ఉంది.
1. మహిళల టెస్ట్ క్రికెట్‌లో 600 పరుగుల మార్క్ దాటిన తొలి జట్టుగా భారత్. ఈ ఏడాదే పెర్త్‌లో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై ఆస్ట్రేలియా సాధించిన 575/9 (డిక్లేర్) రికార్డును మనమ్మాయిలు బద్దలు కొట్టారు.
Updated Date - Jun 30 , 2024 | 02:09 AM