ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

IPL 2024: ఫైనల్‌లో చేతులెత్తేసిన హైదరాబాద్ బ్యాటర్లు.. 113 పరుగులకే ఆలౌట్!

ABN, Publish Date - May 26 , 2024 | 09:32 PM

ఎన్నో అంచనాల మధ్య మొదలైన మ్యాచ్ చాలా చప్పగా ఏకపక్షంగా సాగింది. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై కోల్‌కతా బౌలర్లు చెలరేగడంతో హైదరాబాద్ బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో హైదరాబాద్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. 18.3 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌటైంది.

IPL 2024 Final

చెన్నైలోని చెపాక్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఫైనల్ (IPL 2024) మ్యాచ్ జరుగుతోంది (SRH VS KKR). టాస్ గెలిచిన హైదరాబాద్ టీమ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఎన్నో అంచనాల మధ్య మొదలైన మ్యాచ్ చాలా చప్పగా ఏకపక్షంగా సాగింది. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై కోల్‌కతా బౌలర్లు చెలరేగడంతో హైదరాబాద్ బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో హైదరాబాద్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. 18.3 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌటైంది.


హైదరాబాద్ బ్యాటర్లలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (24) టాప్ స్కోరర్ అంటే ఇన్నింగ్స్ ఎంతో ఘోరంగా సాగిందో ఊహించుకోవచ్చు. ఆరంభం నుంచే వికెట్లు పడగొడుతూ కేకేఆర్ బౌలర్లు ఒత్తిడి పెంచారు. హార్డ్ హిట్టింగ్ ఓపెనర్లు అభిషేక్ శర్మ (2), ట్రావిస్ హెడ్ (0) మొదట్లోనే అవుట్ కావడంతో హైదరాబాద్ ఇన్నింగ్స్ తడబడుతూనే సాగింది. ఆ తర్వాత బరిలోకి దిగిన రాహుల్ త్రిపాఠి (9), నితీష్ రెడ్డి (13), ఆదెల్ మార్‌‌క్రమ్ (20), షాబాజ్ అహ్మద్ (8), అబ్దుల్ సమద్ (4) వరుసగా వెనుదిరిగారు.


ఆదుకుంటాడనుకున్న క్లాసెన్ (16) కూడా నిరాశపరిచాడు. చివర్లో కెప్టెన్ కమిన్స్ 24 పరుగులు చేసి జట్టు స్కోరును వంద పరుగులు దాటించాడు. చివరకు హైదరాబాద్ టీమ్ 18.3 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌటైంది. కేకేఆర్ బౌలర్లలో రస్సెల్ 3, స్టార్క్ 2, హర్షిత్ 2, అరోరా, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ తలో వికెట్ తీశారు. కోల్‌కతా విజయానికి 114 పరుగులు కావాలి.

Updated Date - May 26 , 2024 | 09:32 PM

Advertising
Advertising