ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

IPL 2024 Final: కష్టాల్లో హైదరాబాద్.. ఆరంభంలోనే ఓపెనర్లు అవుట్!

ABN, Publish Date - May 26 , 2024 | 07:48 PM

చెన్నైలోని చెపాక్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన హైదరాబాద్ టీమ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆరంభంలోనే ఓపెనర్లు ఇద్దరూ పెవిలియన్ బాట పట్టారు.

Abhishek Sharma

చెన్నైలోని చెపాక్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన హైదరాబాద్ టీమ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆరంభంలోనే ఓపెనర్లు ఇద్దరూ పెవిలియన్ బాట పట్టారు. తొలి ఓవర్‌లోనే అద్భుతమైన అవుట్ స్వింగ్‌తో ఓపెనర్ అభిషేక్ శర్మ‌ను మిచెల్ స్టార్క్ క్లీన్ బౌల్డ్ చేశాడు. రెండు పరుగులకే అభిషేక్ పెవిలియన్ బాట పట్టాడు.


మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్‌ను వైభవ్ అరోరా అవుట్ స్వింగ్‌తో బోల్తా కొట్టించాడు. దీంతో పరుగులేమీ చేయకుండానే ట్రావిస్ అవుటయ్యాడు. దీంతో హైదరాబాద్ అభిమానులు షాకయ్యారు. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై పరుగులు చేయడానికి హైదరాబాద్ బ్యాటర్లు చెమటోడుస్తున్నారు. తొలి 3 ఓవర్లలో హైదరాబాద్ కేవలం 15 పరుగులు మాత్రమే చేసింది. రాహుల్ త్రిపాఠి (7 నాటౌట్), మార్‌క్రమ్ (4 నాటౌట్) క్రీజులో ఉన్నారు.

Updated Date - May 26 , 2024 | 07:48 PM

Advertising
Advertising