IPL Mega Auction : ఐపీఎల్ వేలం బరిలో 13 ఏళ్ల వైభవ్
ABN, Publish Date - Nov 16 , 2024 | 06:20 AM
ఐపీఎల్ మెగా వేలం జాబితా ఖరారైంది. సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఈనెల 24, 25 తేదీల్లో జరిగే ఈ వేలంలో మొత్తం 574 మంది క్రికెటర్లు బరిలో నిలిచారు. టీమిండియా స్టార్లు రిషభ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అర్ష్‌దీప్ సింగ్ 2 కోట్ల రూపాయల బేస్ ధరతో వేలానికే ప్రధాన
మొత్తం 574 మంది క్రికెటర్లు 366 మంది భారతీయులు
న్యూఢిల్లీ: ఐపీఎల్ మెగా వేలం జాబితా ఖరారైంది. సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఈనెల 24, 25 తేదీల్లో జరిగే ఈ వేలంలో మొత్తం 574 మంది క్రికెటర్లు బరిలో నిలిచారు. టీమిండియా స్టార్లు రిషభ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అర్ష్‌దీప్ సింగ్ 2 కోట్ల రూపాయల బేస్ ధరతో వేలానికే ప్రధాన ఆకర్షణ కానున్నారు. 13 ఏళ్ల భారత్ అండర్-19 క్రికెటర్, బిహార్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీ వేలంలో నిలిచిన అతి చిన్న వయస్సు ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. రూ. 30 లక్షల బేస్ ధరతో అతడు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. వాస్తవంగా మొత్తం 1574 మంది క్రికెటర్లు వేలంలో పేర్లు నమోదు చేసుకున్నారు. అయితే బీసీసీఐ ఆ జాబితాను 574కి కుదించింది. వీరిలో 366 మంది భారత ఆటగాళ్లుకాగా 208 విదేశీ క్రికెటర్లున్నారు. పంత్ అత్యధిక ధర పలుకుతాడని అంచనా. పేసర్లు షమి, సిరాజ్, చాహల్, అవేశ్ ఖాన్ వేలంలో నిలిచిన ఇతర స్టార్ ఆటగాళ్లు. రూ. 2 కోట్ల ధరతో 81 మంది క్రికెటర్లు వేలానికి వస్తుండగా, 27 మంది రూ. 1.5 కోట్ల శ్రేణిలో ఉన్నారు. 18 మంది రూ. 1.25 కోట్లు, 23 మంది రూ. కోటి రేటుతో బరిలో దిగనున్నారు. రూ. 2 కోట్లతో ఇంగ్లండ్‌కు చెందిన బట్లర్, బ్రూక్, బెయిర్ స్టోతో అత్యధిక మొత్తంతో వేలంలో అడుగుపెడుతున్న విదేశీ క్రికెటర్ల జాబితాలో ఉన్నారు. జేమ్స్ అండర్సన్ రూ. 1.25 కోట్లతో తన పేరు నమోదు చేసుకోవడం గమనార్హం.
Updated Date - Nov 16 , 2024 | 06:20 AM