మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కోచ్‌గా గంభీర్‌ ఖరారేనా?

ABN, Publish Date - May 29 , 2024 | 06:27 AM

భారత జట్టు కోచ్‌గా మాజీ ఓపెనర్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మెంటార్‌ గౌతమ్‌ గంభీర్‌ ఎంపిక దాదాపుగా ఖరారైనట్టుగా వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని...

కోచ్‌గా గంభీర్‌ ఖరారేనా?

చర్చలు జరుగుతున్నాయంటూ ఊహాగానాలు

న్యూఢిల్లీ: భారత జట్టు కోచ్‌గా మాజీ ఓపెనర్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మెంటార్‌ గౌతమ్‌ గంభీర్‌ ఎంపిక దాదాపుగా ఖరారైనట్టుగా వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. కోల్‌కతాను ఐపీఎల్‌ టైటిల్‌ విజేతగా నిలిపిన తర్వాత గంభీర్‌ను టీమిండియా కోచ్‌గా ఎంపిక చేయాలన్న డిమాండ్‌ ఊపందుకొంది. హెడ్‌ కోచ్‌ కోసం దరఖాస్తుల డెడ్‌లైన్‌ సోమవారంతో ముగిసింది. కాగా, కోచ్‌గా గౌతీ ఎంపిక ఇప్పటికే జరిగిపోయినట్టు ఐపీఎల్‌ టీమ్‌ యజమాని ఒకరు తనకు చెప్పారని ప్రముఖ కా మెంటేటర్‌ తెలిపినట్టు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం గంభీర్‌కిచ్చే జీతభత్యాల విషయంలో చర్చలు జరుగుతున్నట్టు కూడా చెబుతున్నారు. టీమిండియా కోచ్‌ పోస్టు కోసం ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లను సంప్రదించారంటూ వస్తున్న వార్తలను బీసీసీఐ కార్యదర్శి జై షా ఖండించిన సంగతి తెలిసిందే. భారత దేశవాళీ క్రికెట్‌ వ్యవస్థపై లోతైన అవగాహన ఉన్న వారినే కోచ్‌గా తీసుకొనే అవకాశాలున్నాయని జైషా ఇప్పటికే స్పష్టం చేశాడు.

Updated Date - May 29 , 2024 | 06:27 AM

Advertising
Advertising