జడేజా అవుట్ ఇలా..
ABN, Publish Date - May 13 , 2024 | 12:46 AM
జడేజా అబ్‌స్ట్రక్లింగ్ ది ఫీల్డ్ పద్ధతిలో రనౌటయ్యాడు. అవేశ్ ఖాన్ వేసిన 16 ఓవర్ ఐదో బంతిని జడేజా థర్డ్‌మ్యాన్‌వైపు కొట్టి పరుగు తీశాడు. రెండో రన్‌కోసం కూడా జడేజా ప్రయత్నించగా మరో ఎండ్‌లో...
జడేజా అబ్‌స్ట్రక్లింగ్ ది ఫీల్డ్ పద్ధతిలో రనౌటయ్యాడు. అవేశ్ ఖాన్ వేసిన 16 ఓవర్ ఐదో బంతిని జడేజా థర్డ్‌మ్యాన్‌వైపు కొట్టి పరుగు తీశాడు. రెండో రన్‌కోసం కూడా జడేజా ప్రయత్నించగా మరో ఎండ్‌లో ఉన్న రుతురాజ్ నివారించాడు. దాంతో జడేజా మళ్లీ వెనక్కు మళ్లాడు. ఈలోపు థర్డ్‌మ్యాన్‌లో ఉన్న ఫీల్డర్ అందించిన బంతిని బౌలింగ్ ఎండ్‌వైపు కీపర్ శాంసన్ విసిరాడు. ఈక్రమంలో..వెనక్కు మళ్లిన జడేజాకు ఆ బంతి తగిలింది. దాంతో రనౌట్‌కోసం రాజస్థాన్ అప్పీలు చేసింది. బంతి ఏ దిశలో వస్తుందో తెలిసీ జడేజా..ఆ దిశలో వెనక్కు వెళ్లాడని భావించిన అంపైర్ అతడిని అవుట్‌గా ప్రకటించాడు. ఐపీఎల్‌లో ఇలా అవుటైన మూడో ఆటగాడు జడేజా. 2013లో యూసుఫ్ పఠాన్, 2019 అమిత్ మిశ్రా కూడా ఈ విధంగానే నిష్క్రమించాడు.
Updated Date - May 13 , 2024 | 12:46 AM