ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జొకో సాధించాడు

ABN, Publish Date - Aug 05 , 2024 | 04:46 AM

రెండు దశాబ్దాల ప్రొఫెషనల్‌ కెరీర్‌లో 24 గ్రాండ్‌స్లామ్‌లు.. లెక్కలేనన్ని టూర్‌ టైటిళ్లు.. కానీ సెర్బియా దిగ్గజం నొవాక్‌ జొకోవిచ్‌కు ఒలింపిక్‌ స్వర్ణ పతకం అందని ద్రాక్షగానే మిగిలింది...

సెర్బియా దిగ్గజానికి సింగిల్స్‌ స్వర్ణం

ఫైనల్లో అల్కారజ్‌ చిత్తు

రెండు దశాబ్దాల ప్రొఫెషనల్‌ కెరీర్‌లో 24 గ్రాండ్‌స్లామ్‌లు.. లెక్కలేనన్ని టూర్‌ టైటిళ్లు.. కానీ సెర్బియా దిగ్గజం నొవాక్‌ జొకోవిచ్‌కు ఒలింపిక్‌ స్వర్ణ పతకం అందని ద్రాక్షగానే మిగిలింది. పైగా వయసు 37. వెంటాడుతున్న గాయం బెడద. జరిగిన మూడు గ్రాండ్‌స్లామ్‌ల్లో ఒక్కటీ దక్కని బాధ. మరోవైపు స్పెయిన్‌ కుర్రాడు అల్కారజ్‌ రూపంలో పొంచివున్న ప్రమాదం. ఇన్ని ప్రతికూలతల నడుమ జొకో అనుకున్నది సాధించాడు. ఒలింపిక్స్‌ స్వర్ణంతో తన కెరీర్‌ను సంపూర్ణం చేసుకున్నాడు. అలాగే అరుదైన గోల్డెన్‌ స్లామ్‌ (4 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లతోపాటు ఒలింపిక్స్‌ సింగిల్స్‌ స్వర్ణం) కూడా అందుకున్నాడు. ఆదివారం ఉత్కంఠగా జరిగిన సింగిల్స్‌ తుది పోరులో జొకో 7-6 (3), 7-6 (2)తో అల్కారజ్‌ను ఓడించి విజేతగా నిలిచాడు. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో నొవాక్‌ కాంస్యం సాధించాడు. తర్వాతి మూడు విశ్వక్రీడల్లో తీవ్రంగా ప్రయత్నించినా స్వర్ణం అందుకోలేకపోయాడు. ఎట్టకేలకు కెరీర్‌ చరమాంకంలో పసిడి పతకంతో తన కలను జొకో నెరవేర్చుకున్నాడు.

Updated Date - Aug 05 , 2024 | 04:46 AM

Advertising
Advertising
<