Kanpur: ఒక్క బంతీ పడలేదు..
ABN, Publish Date - Sep 29 , 2024 | 06:05 AM
తొలిరోజు 35 ఓవర్ల ఆటకు అనుమతించిన వరుణుడు రెండోరోజు శనివారం ఆ కాస్త అవకాశాన్ని కూడా ఇవ్వలేదు. ఉదయం నుంచి కురిసిన వర్షంతో గ్రీన్‌పార్క్ మైదానం చిత్తడిగా మారింది.
రెండో రోజూ వర్షార్పణం
బంగ్లాతో భారత్ రెండో టెస్టు
కాన్పూర్: తొలిరోజు 35 ఓవర్ల ఆటకు అనుమతించిన వరుణుడు రెండోరోజు శనివారం ఆ కాస్త అవకాశాన్ని కూడా ఇవ్వలేదు. ఉదయం నుంచి కురిసిన వర్షంతో గ్రీన్‌పార్క్ మైదానం చిత్తడిగా మారింది. దీంతో ఒక్క బంతీ పడకుండానే ఆట రద్దయ్యింది. మధ్యాహ్నం 2 గంటల వరకు వేచి చూసినా గ్రౌండ్ ఆటకు అనుకూలంగా లేకపోవడంతో అంపైర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్‌లో 2015 బెంగళూరు టెస్టు తర్వాత ఓ రోజు ఆట పూర్తిగా రద్దు కావడం ఇదే తొలిసారి. ఉదయం పది గంటలకు వర్షం ఆగినా మరో గంట తర్వాత మళ్లీ కురవడంతో కవర్లను అలాగే ఉంచాల్సి వచ్చింది. మధ్యలో సూపర్‌సాపర్లతో నీటిని తోడేసే ప్రయత్నం జరిగినా ఫలితం లేకపోయింది. మధ్యాహ్నం మరోసారి చిరుజల్లులు కురియడంతో 2 గంటలకు అంపైర్లు ఆటను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. మూడో రోజు ఆదివారం కూడా వర్షం ఇబ్బంది కలిగించవచ్చు. ఇక ఈ మ్యాచ్‌లో బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో 107/3 పరుగులతో కొనసాగుతోంది.
Updated Date - Sep 29 , 2024 | 06:05 AM