IPL 2024: రూ.25 కోట్లు వేస్ట్.. కేకేఆర్ పేసర్ మిచెల్ స్టార్క్‌పై విమర్శలు.. అతడి సమాధానం ఏంటంటే..
ABN, Publish Date - Apr 17 , 2024 | 04:30 PM
ఈ ఏడాది ఆరంభంలో దుబాయ్‌లో జరిగిన వేలంలో ఆస్ట్రేలియన్ పేసర్ మిచెల్ స్టార్క్ కోసం కోల్‌కతా భారీ మొత్తం వెచ్చించింది. మిగతా ఫ్రాంఛైజీలతో పోటీ పడి మరీ స్టార్క్‌ను రూ. 24.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఫలితంగా ఐపీఎల్‌లోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా మిచెల్ స్టార్క్ నిలిచాడు.
ఈ ఏడాది ఆరంభంలో దుబాయ్‌లో జరిగిన వేలంలో ఆస్ట్రేలియన్ పేసర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) కోసం కోల్‌కతా (KKR) భారీ మొత్తం వెచ్చించింది. మిగతా ఫ్రాంఛైజీలతో పోటీ పడి మరీ స్టార్క్‌ను రూ. 24.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఫలితంగా ఐపీఎల్‌లోనే (IPL 2024) అత్యంత ఖరీదైన ఆటగాడిగా మిచెల్ స్టార్క్ నిలిచాడు. అయితే అందుకు తగ్గ ప్రదర్శన మాత్రం చేయలేకపోతున్నాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో వికెట్లేమీ తీయలేకపోయాడు. పైగా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. అయితే ఆ తర్వాత లఖ్‌నవూ మ్యాచ్‌లో గాడిన పడ్డాడు. మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు.
మంగళవారం నాటి మ్యాచ్‌లో (RR vs KKR) మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. 4 ఓవర్లలో ఏకంగా 50 పరుగులు సమర్పించుకున్నాడు. కీలకమైన 18 ఓవర్లో భారీగా పరుగులు ఇచ్చి ఓటమికి కారణమయ్యాడు. దీంతో స్టార్క్‌పై కేకేఆర్ ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. స్టార్క్ కాస్త పొదుపుగా బౌలింగ్ చేసి ఉంటే కోల్‌కతాకు ఓటమి తప్పేదని కామెంట్లు చేశారు. కేకేఆర్‌కు రూ.25 కోట్లు వేస్ట్ అయ్యాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రెండ్రోజుల క్రితమే తనపై విమర్శల గురించి స్టార్క్ స్పందించాడు.
``పేపర్లో వార్తలు పెద్దగా చదవను. కాబట్టి, నాకు పెద్ద సమస్య ఉండదు. గత రెండేళ్లుగా నేను టీ-20 క్రికెట్ పెద్దగా ఆడలేదు. నేను రిథమ్‌లోకి రావడానికి కొంచెం సమయం పడుతుంది. అప్పుడు పరిస్థితులు మారతాయి. టెస్ట్ క్రికెట్‌తో పోల్చుకుంటే టీ-20 క్రికెట్‌లో శారీరక శ్రమ తక్కువే. కాకపోతే ఎక్కువ వ్యూహాలను ఉపయోగించాల``ని స్టార్క్ పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి..
Sunil Narine: సునీల్ నరైన్ చారిత్రాత్మక రికార్డ్.. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి
IPL 2024: ఈసారి టైటిల్ ఆ జట్టుదే.. జోస్యం చెప్పిన రికీ పాంటింగ్
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Apr 17 , 2024 | 04:30 PM