KL Rahul: లఖ్‌నవూ యజమాని సంజీవ్ గోయెంకాను కలిసినా రాహుల్.. ఎల్‌ఎస్‌జీతో ఉండే విషయంలో నో క్లారిటీ!
ABN, Publish Date - Aug 27 , 2024 | 08:19 PM
వచ్చే ఏడాది ఐపీఎల్‌కు ముందు భారీ వేలం జరగబోతోంది. ఐపీఎల్‌లోని జట్ల రూపురేఖలు చాలా వరకు మారబోతున్నాయి. ఈ మెగా వేలంలో స్టార్ ఆటగాళ్లను దక్కించుకోవాలని పలు ఫ్రాంఛైజీలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. అయితే ఏ ఫ్రాంఛైజీ అయినా కొందరు ఆటగాళ్లను వేలంలోకి వదలకుండా రిటైన్ చేసుకోవచ్చు.
వచ్చే ఏడాది ఐపీఎల్ (IPL)కు ముందు భారీ వేలం జరగబోతోంది. ఐపీఎల్‌లోని జట్ల రూపురేఖలు చాలా వరకు మారబోతున్నాయి. ఈ మెగా వేలంలో (IPL Auction) స్టార్ ఆటగాళ్లను దక్కించుకోవాలని పలు ఫ్రాంఛైజీలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. అయితే ఏ ఫ్రాంఛైజీ అయినా కొందరు ఆటగాళ్లను వేలంలోకి వదలకుండా రిటైన్ (Retention) చేసుకోవచ్చు. అలా ఎంతమందిని రిటైన్ చేసుకోవచ్చనే విషయంపై బీసీసీఐ (BCCI) రూల్స్ ప్రకారం నడుచుకోవాలి. ఈ విషయంలో ఇంకా బీసీసీఐ నుంచి క్లారిటీ రాలేదు. కాగా, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (LSG) కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) ఈ ఏడాది వేలంలోకి అందుబాటులో ఉంటాడని వార్తలు వస్తున్నాయి.
కేఎల్ రాహుల్‌ను ఎల్‌ఎస్‌జీ వదిలించుకుంటోందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కోల్‌కతా వెళ్లిన కేఎల్ రాహుల్ ఎల్‌ఎస్‌జీ ఓనర్ సంజీవ్ గోయెంకా (Sanjiv Goenka)ను కలిశాడు. గంటకు పైగా అతడితో చర్చలు జరిపాడు. తాను ఎల్‌ఎసీజీతోనే ఉంటాననే సంకేతాలు పంపే ప్రయత్నం చేశాడు. అయితే రాహుల్‌ను రిటైన్ చేసుకోవాలనే ఆలోచన మాత్రం ఎల్‌ఎస్‌జీకి లేదని వార్తలు వస్తున్నాయి. ఎల్‌ఎస్‌జీ ఫ్రాంఛైజీ తాజాగా విడుదల చేసిన ప్రకటన చూస్తే వారికి రాహుల్‌పై పెద్దగా ఆసక్తి లేదని అర్థమవుతోంది. ఒకవేళ రాహుల్‌ను రిటైన్ చేసుకున్నా కెప్టెన్సీ ఇవ్వడం మాత్రం కుదరదని స్పష్టం చేశారు.
``కోల్‌కతాలోని ఆర్‌పీజీ ఆఫీస్‌లో సంజీవ్ గోయెంకాను కేఎల్ రాహుల్ కలిశాడు. జట్టుతో పాటే ఉండాలనుకుంటున్నానని చెప్పాడు. అయితే ఈ విషయంలో మేనేజ్‌మెంట్ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. బీసీసీఐ రిటెన్షన్ పాలసీని ప్రకటించిన తర్వాతే ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటాం. ప్రస్తుతానికి లఖ్‌నవూ ఎవరికీ మాటివ్వలేదు. ఒకవేళ రాహుల్‌ను రిటైన్ చేసుకున్నా అతడిని కెప్టెన్‌గా కొనసాగించే అవకాశం లేదు. మేం కొత్త కెప్టెన్ కోసం అన్వేషిస్తున్నాం. రాహుల్ కూడా బ్యాటర్‌గా మెరుగైన సేవలు అందించాలని అనుకుంటున్నాడు`` అంటూ ఎల్‌ఎస్‌జీ ఫ్రాంఛైజీ వర్గాలు ఓ లేఖను విడుదల చేశాయి.
ఇవి కూడా చదవండి..
బీసీసీఐ కార్యదర్శిగా రోహన్ జైట్లీ?
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Aug 27 , 2024 | 08:19 PM