ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రాహుల్‌.. అదే తీరు

ABN, Publish Date - Nov 09 , 2024 | 06:01 AM

ఆస్ట్రేలియా ‘ఎ’తో జరుగుతున్న రెండో అనధికార టెస్టులో భారత్‌ ‘ఎ’ టాపార్డర్‌ వైఫల్యం కొనసాగుతోంది. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (10) మరోసారి నిరాశపర్చగా.. భారత్‌ ‘ఎ’ రెండో ఇన్నింగ్స్‌లో 73

ఓటమిదిశగా భారత్‌ ‘ఎ’ రెండో ఇన్నింగ్స్‌ 73/5

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా ‘ఎ’తో జరుగుతున్న రెండో అనధికార టెస్టులో భారత్‌ ‘ఎ’ టాపార్డర్‌ వైఫల్యం కొనసాగుతోంది. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (10) మరోసారి నిరాశపర్చగా.. భారత్‌ ‘ఎ’ రెండో ఇన్నింగ్స్‌లో 73 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం 11 పరుగుల స్వల్ప ఆధిక్యంలో ఉండగా.. క్రీజులో జురెల్‌ (19 బ్యాటింగ్‌), నితీశ్‌ (9 బ్యాటింగ్‌) ఉన్నారు. ఈ జోడీ మినహా స్పెషలిస్ట్‌ బ్యాటర్లు లేకపోవడంతో జట్టుకు మరో ఓటమి ఖాయంగా కనిపిస్తోంది. అంతకుముందు ఆసీస్‌ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 223 వద్ద ఆలౌటై 62 పరుగుల ఆధిక్యాన్ని అందుకుంది. హారిస్‌ (74), రోకిచోలి (35), పీర్సన్‌ (30) రాణించారు. ప్రసిద్ధ్‌కు నాలుగు, ముకేశ్‌కు మూడు, ఖలీల్‌కు రెండు వికెట్లు దక్కాయి. భారత్‌ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 161 పరుగులు చేసింది.

Updated Date - Nov 09 , 2024 | 06:01 AM