ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కోహ్లీ.. పదేళ్లలో తొలిసారి

ABN, Publish Date - Nov 07 , 2024 | 03:55 AM

న్యూజిలాండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో ఘోరంగా విఫలమైన విరాట్‌ కోహ్లీ ర్యాంకింగ్స్‌లో మరింత పడిపోయాడు. బుధవారం ప్రకటించిన ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌ బ్యాటర్ల జాబితాలో విరాట్‌ 8 స్థానాలు కోల్పోయి 22వ స్థానానికి...

దుబాయ్‌: న్యూజిలాండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో ఘోరంగా విఫలమైన విరాట్‌ కోహ్లీ ర్యాంకింగ్స్‌లో మరింత పడిపోయాడు. బుధవారం ప్రకటించిన ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌ బ్యాటర్ల జాబితాలో విరాట్‌ 8 స్థానాలు కోల్పోయి 22వ స్థానానికి దిగజారాడు. టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ టాప్‌-20లో లేకపోవడం గత పదేళ్లలో ఇదే తొలిసారి. ఇక, రెండు స్థానాలు చేజార్చుకున్న రోహిత్‌ శర్మ 26వ ర్యాంక్‌కు పడిపోయాడు. రిషభ్‌ పంత్‌ ఐదు స్థానాలు మెరుగుపరచుకొని 6వ ర్యాంక్‌కు చేరగా.. యశస్వీ జైస్వాల్‌ ఓ స్థానం కోల్పోయినా 4వ ర్యాంక్‌తో భారత్‌ నుంచి టాప్‌ బ్యాటర్‌గా ఉన్నాడు. ఇక జో రూట్‌ టాప్‌ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. బౌలర్లలో అశ్విన్‌ ఓ స్థానం చేజారి 5వ ర్యాంక్‌లో, బుమ్రా 3వ స్థానంలో ఉన్నారు. ఆల్‌రౌండర్లలో జడేజా నెంబర్‌వన్‌ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు.

Updated Date - Nov 07 , 2024 | 03:55 AM