ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కెప్టెన్‌ అయ్యాక కోహ్లీ మారిపోయాడు!

ABN, Publish Date - Jul 17 , 2024 | 05:45 AM

విరాట్‌ కోహ్లీ కెప్టెన్‌ అయ్యాక చాలా మారాడని, అతడికి స్నేహితులు కూడా తక్కువేనని వెటరన్‌ స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా వ్యాఖ్యానించాడు. కానీ తాజా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాత్రం అలా కాదని, ఎవరితోనైనా సరదాగా..

న్యూఢిల్లీ: విరాట్‌ కోహ్లీ కెప్టెన్‌ అయ్యాక చాలా మారాడని, అతడికి స్నేహితులు కూడా తక్కువేనని వెటరన్‌ స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా వ్యాఖ్యానించాడు. కానీ తాజా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాత్రం అలా కాదని, ఎవరితోనైనా సరదాగా ఉంటాడని కితాబిచ్చాడు. ‘నాకు విరాట్‌ చిన్నప్పటినుంచే తెలుసు. కానీ జట్టు కెప్టెన్‌ అయ్యాక అతనిలో చాలా మార్పు కనిపించింది. నేనిప్పుడు తనతో గతంలో ఉన్నంత చనువుగా లేను. దాదాపుగా మాట్లాడుకోవడమే లేదు. అయితే క్రికెటర్‌గా విరాట్‌ను గౌరవిస్తాను. ఓ వ్యక్తికి పేరు, డబ్బు వచ్చాక అతడి దగ్గరికి ఇతరులు ఏదో ఆశించే వెళతారని భావిస్తారు. కానీ రోహిత్‌ స్వభావం విరాట్‌కు పూర్తి భిన్నం. నేను చాలా ఏళ్లుగా జట్టులో లేకపోయినా.. కెరీర్‌ ఆరంభంలో నాతో ఎలా ఉన్నాడో ఇప్పటికీ అలాగే ఉంటాడు. ఐపీఎల్‌లో కానీ బయట ఎక్కడ కనిపించినా సరదాగా మాట్లాడుతాడు’ అని అమిత్‌ వివరించాడు.


అలాగే గతేడాది ఐపీఎల్‌లో లఖ్‌నవూ పేసర్‌ నవీనుల్‌ను కోహ్లీనే మొదట దుర్భాషలాడాడని, అలాంటి వ్యక్తిని అతడు మున్ముందు ఎలా గౌరవిస్తాడని ప్రశ్నించాడు.

Updated Date - Jul 17 , 2024 | 05:45 AM

Advertising
Advertising
<